అయినా... పొట్ట తగ్గలేదు

నాకు ప్రసవమయ్యి పదినెలలు అయ్యింది. సిజేరియన్‌. కానీ ఇప్పటికీ పొట్ట, స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గలేదు. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? తొమ్మిదేళ్ల కిందట థైరాయిడ్‌

Updated : 13 Jun 2021 07:09 IST

నాకు ప్రసవమయ్యి పదినెలలు అయ్యింది. సిజేరియన్‌. కానీ ఇప్పటికీ పొట్ట, స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గలేదు. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? తొమ్మిదేళ్ల కిందట థైరాయిడ్‌ ఆపరేషన్‌ జరిగింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో టైర్‌ మెడిసిన్‌ వాడా. - ఓ సోదరి
కాన్పు తర్వాత పొట్ట పెరగడానికి, స్ట్రెచ్‌ మార్క్స్‌ రావడానికి కారణాలు తెలుసుకుంటే.. అవి తగ్గడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడు పొట్టలోని కండరాలు, చర్మం అన్నీ సాగి వదులై, పటుత్వాన్ని కోల్పోతాయి. చర్మం ఎక్కువగా సాగినప్పుడు లోపలి పొరలు చిట్లి అక్కడ మొదట ఎర్రగా, ఆ తర్వాత తెల్లగా గీతలు పడతాయి. కాన్పు కాగానే పొట్ట ఖాళీ అయినా తొమ్మిది నెలలూ సాగిన కండరాలు వెంటనే యథాస్థితికి రావడం సాధ్యం కాదు. వాటి పటుత్వం పెరగడానికి సమయం పడుతుంది. అప్పటిదాకా పొట్టకు ఆసరాగా అబ్డామినల్‌ బెల్ట్‌ వాడటం, మర్దనా లాంటివి కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. శాశ్వతంగా యథాస్థితికి రావాలంటే పొట్ట, కటివలయంలోని కండరాలు తిరిగి బలపడటానికి వ్యాయామం తప్పనిసరి. పోస్ట్‌ నేటల్‌, కెగెల్‌ ఎక్సర్‌సైజులు నేర్చుకుని క్రమం తప్పక చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది. అయితే గర్భిణి ఉన్నప్పుడు ఉమ్మనీరు ఎక్కువున్నా, బరువుగా ఉన్న పిల్లలు, కవలలు పుట్టినప్పుడు కండరాలుసాగి/దెబ్బతిని ఎప్పటికీ ముందున్న స్థితికి రాలేవు. అలాంటి వారికి వెంట్రల్‌ హెర్నియా అనే సమస్య కూడా రావొచ్చు. వీరు కాన్పులన్నీ అయ్యాక ప్లాస్టిక్‌ సర్జరీ లేదా లేజర్‌ చికిత్స చేయించుకోవచ్చు. స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గాలంటే గర్భిణిగా ఉన్నప్పుడే చర్మానికి ఎక్కువ తేమను అందించాలి. ఇందు కోసం బాగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ప్రత్యేకించి స్ట్రెచ్‌ మార్క్స్‌ క్రీములు దొరుకుతాయి. వాటిని వాడలేనివారు నిరంతరం కొబ్బరి నూనెతో పొట్టపై మృదువుగా మర్దనా చేస్తూ ఉండాలి. అయితే ఇవి స్ట్రెచ్‌ మార్క్స్‌ని పూర్తిగా నిరోధించలేవు. థైరాయిడ్‌ ఆపరేషన్‌, మందులకు పొట్ట పెరగడానికి సంబంధమేమీ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్