మాతృభూమి కోసం..

కొవిడ్‌ కల్లోలంలో తనకు ఎదురైన అనుభవాల నుంచి తేరుకున్న ఓ యువ ప్రవాసీ వైద్యురాలు భారత్‌కు అండగా నిలిచేందుకు నిధుల సమీకరణకు నడుం కట్టింది... తోటి వైద్యులనూ కదిలించింది.. అగ్రరాజ్య వీధుల్లో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించింది. ఆమే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మనోజ్ఞ ప్రసాద్‌.

Published : 26 Jun 2021 01:39 IST

కొవిడ్‌ కల్లోలంలో తనకు ఎదురైన అనుభవాల నుంచి తేరుకున్న ఓ యువ ప్రవాసీ వైద్యురాలు భారత్‌కు అండగా నిలిచేందుకు నిధుల సమీకరణకు నడుం కట్టింది... తోటి వైద్యులనూ కదిలించింది.. అగ్రరాజ్య వీధుల్లో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించింది. ఆమే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మనోజ్ఞ ప్రసాద్‌.

‘ఇటీవల మానాన్న కొవిడ్‌ బారిన పడ్డారు. సరైన వైద్యం దొరక్క పరిస్థితి విషమించింది.. కష్టమ్మీద కోలుకున్నారు. కానీ నా స్నేహితులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎందరో కొవిడ్‌తో చనిపోయారు. నా మాతృభూమి కోసం ఏదైనా చేయాలనిపించింది.  వసతుల కల్పనకు నిధుల సమీకరణే దారనిపించింది’ అనే మనోజ్ఞ వాళ్లది హైదరాబాదులోని మల్కాజిగిరి. పుణేలో ఎంబీబీఎస్‌ చేసిన మనోజ్ఞ.. ఏడాది కిందట పీజీ కోసం అమెరికా వెళ్లింది. ప్రస్తుతం న్యూజెర్సీలో సెయింట్‌ మైఖేల్‌ మెడికల్‌ సెంటర్‌లో క్రిటికల్‌  మెడికల్‌ రెసిడెంట్‌. భారత్‌లోని పరిస్థితులని తోటి వైద్యులతో పంచుకుంది. వారంతా ముందుకు రావడంతో ‘డాక్టర్స్‌ వితవుట్‌ బార్డర్స్‌’ స్వచ్ఛంద సంస్థకు అందించేందుకు నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ ద్వారా మన దేశంలో వైద్యవసతుల  కల్పనకు నిధుల్ని వెచ్చించాలన్నది ఆమె ఆలోచన. 40మంది యువ వైద్యులతో న్యూయార్క్‌ నగరంలో మార్చ్‌లను నిర్వహిస్తోంది. రెండు రోజుల్లోనే 4లక్షల రూపాయలు సమీకరించామని మనోజ్ఞ తెలిపింది. పది లక్షల రూపాయలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్