మెడలో స్టెత్‌.. చేతిలో గన్‌!

మిలిటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ, మంచులో దాదాపుగా నడుము వరకూ కూరుకుపోయి పహారా కాస్తున్నారొకరు. గురుతులన్నీ సైనికురాలని చెబుతున్నాయి కదూ! మెడలో స్టెతస్కోప్‌ ఎందుకంటే తను డాక్టర్‌ కూడా మరి! ఈమెవరో తెలుసుకుందామా! దేశ రక్షణలో అమ్మాయిల ప్రాతినిధ్యం పెరుగుతోంది

Published : 01 Jul 2021 01:20 IST

మిలిటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ, మంచులో దాదాపుగా నడుము వరకూ కూరుకుపోయి పహారా కాస్తున్నారొకరు. గురుతులన్నీ సైనికురాలని చెబుతున్నాయి కదూ! మెడలో స్టెతస్కోప్‌ ఎందుకంటే తను డాక్టర్‌ కూడా మరి! ఈమెవరో తెలుసుకుందామా!
దేశ రక్షణలో అమ్మాయిల ప్రాతినిధ్యం పెరుగుతోంది. మహిళా సైనికులకూ శాశ్వత కమిషన్‌ ప్రకటించిన కొద్ది కాలానికే దేశ నియంత్రణ రేఖ దగ్గర పహారా కాసే అవకాశాన్ని దక్కించుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఈమె పహారాకే పరిమితం కాలేదు. సేనలను ముందుండి నడిపించే కెప్టెన్‌ కూడా. డాక్టర్‌ దీప్సిక ఛెత్రి గురించే ఇదôతా!

దీప్సికది సిక్కింలోని గ్యాంగ్‌టక్‌. రాజేంద్ర కుమార్‌ ఛెత్రి, బిందు ఛత్రి తన అమ్మానాన్నలు. ఈమె చదువులో మొదట్నుంచీ చురుకే. సిక్కిం మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నుంచి ఎంబీబీఎస్‌ చేసింది. తర్వాత మిలిటరీపై ఆసక్తితో ఆర్మీ మెడికల్‌ ఎగ్జామ్‌ రాసింది. దీనిలో మొత్తంగా ఆరో ర్యాంకు, అమ్మాయిల్లో రెండో ర్యాంకు సాధించింది. అలా ఆ రాష్ట్రం నుంచి ఎంపికైన మహిళా సైనికుల్లో రెండో వ్యక్తిగా నిలిచింది. శిక్షణ అనంతరం ఈమెను నియంత్రణ రేఖ దగ్గర నియమించారు. ఇక్కడ తను సైనిక విధులతోపాటు  వైద్య సేవలనూ అందించనుంది. దీప్సిక గురించి సిక్కిం ముఖ్యమంత్రి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. రాష్ట్రం నుంచి దేశానికి సేవలందించే రెండో వ్యక్తిగా నిలిచినందుకు అభినందించడంతోపాటు గర్వంగా ఉందన్నారు. మగవాళ్లకే కష్టమని భావించే నియంత్రణ రేఖ దగ్గర, ప్రతికూల వాతావరణంలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపడంతోపాటు దేశానికీ గర్వకారణంగా దీప్సిక నిలుస్తోంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్