ఆమె పాటకు 105 కోట్ల వ్యూస్!
ఈ పాట ఏ పెద్ద హీరోనో, పాప్ స్టారో, పెద్ద సింగర్దో అయ్యుంటుంది అనుకుంటున్నారా! ఓ ప్రైవేటు ఆల్బమ్దే కానీ.. పాడింది మాత్రం ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి. పేరు..
ఈ పాట ఏ పెద్ద హీరోనో, పాప్ స్టారో, పెద్ద సింగర్దో అయ్యుంటుంది అనుకుంటున్నారా! ఓ ప్రైవేటు ఆల్బమ్దే కానీ.. పాడింది మాత్రం ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి. పేరు.. రేణుక పన్వర్. మన అమ్మాయే. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈమె గురించే!
రేణుకకి చిన్నప్పటి నుంచి పాటలన్నా, డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. అమ్మానాన్నలూ బాగా ప్రోత్సహించారు. వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖేక్డా. మధ్య తరగతి కుటుంబం. తండ్రి చిన్న వ్యాపారి. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలన్నింట్లో పాల్గొనేది. బోలెడన్ని బహుమతులూ తెచ్చుకుంది. ఓ హిందీ టీవీ ఛానెల్ నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొని టైటిల్‌నూ గెలుచుకుంది. పదో తరగతిలో ఉన్నప్పుడు తన గొంతు విని ఓ ప్రైవేట్ ఆల్బమ్ వాళ్లు అవకాశం ఇచ్చారు. అలా 16 ఏళ్ల వయసులో ‘సున్ సోనియో’తో తన మ్యూజికల్ కెరియర్ ప్రారంభమైంది. దానికి మంచి గుర్తింపు వచ్చింది.
రేణుక ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. హిందీ, హరియాణ్వీ భాషల్లో ప్రైవేటు ఆల్బమ్‌లకు పాడుతోంది. వాటిల్లో నటిస్తోంది కూడా. ఈమె పాటలకు ఒక్కోదానికీ కనీసం పది లక్షల వీక్షణలుండటం విశేషం. ఇప్పటివరకూ తను ఈ వీడియోల ద్వారా మూడు కోట్ల రూపాయలకుపైగా సంపాదించింది. కానీ తన ప్రయాణం సులువేమీ కాలేదంటుంది రేణుక. సంగీత సాధన, రిహార్సల్స్ కోసం వెళుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు ‘అమ్మాయికి ఇవన్నీ ఎందుకు?’ అనేవారట. చదువు చెప్పించి, ఇంటి పనులు నేర్పించమనీ, గాయనిని చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందనీ సలహాలిచ్చేవారట. తన కుటుంబం అవేవీ పట్టించుకోకుండా తనను ప్రోత్సహించింది.
తాజాగా ఆమె వీడియో ‘52 గజ్ కా దమన్’ 105 కోట్లకుపైగా వ్యూస్ అందుకుంది. హరియాణ్వీ గర్బా ధరించి నీళ్లకోసం వెళుతున్న అమ్మాయిపై సాగే పాట ఇది. ఉర్రూతలూగించే సంగీతం, సంప్రదాయ దుస్తులు, సంస్కృతి, స్థానికతకు ప్రాధాన్యమివ్వడంతో ఈ పాట ఇప్పుడు ఊపేస్తోంది. తనకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. తన ఇన్‌స్టా ఖాతాని నాలుగు లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. బాలీవుడ్లో అదీ అర్జిత్ సింగ్‌తో కలిసి పాడాలన్నది తన కలట. చూస్తోంటే ఆ కోరిక త్వరలోనే తీరేలా కనిపిస్తోంది కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
- బుట్ట బొమ్మకు... బియ్యపు ముత్యాలు!
- కురులకు.. ఉల్లి నూనె!
ఆరోగ్యమస్తు
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
- కర్రతో చేద్దామా కసరత్తు!
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
- ఆటకు దూరమైనా... అభిమానులు పెరిగారు!
- 30 ఏళ్ల తరవాత... కేన్స్‌లో ఆమె!
'స్వీట్' హోం
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
- విరిగిన పాలతో ఇలా!
- భలే భలే బెడ్‌ల్యాంప్స్!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..