ఐదుగురు అక్కచెల్లెళ్లూ... ఆర్‌ఏఎస్‌ అధికారులు!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటారు. ఎంతో శ్రమిస్తే తప్ప.. ఏ కొద్ది మందికో తప్ప అందరికీ ఆ కల నెరవేరదు. మరి అలాంటిది ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మాయిలు.. అదీ ఇంట్లోనే చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే మాటలా?

Published : 16 Jul 2021 01:55 IST

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటారు. ఎంతో శ్రమిస్తే తప్ప.. ఏ కొద్ది మందికో తప్ప అందరికీ ఆ కల నెరవేరదు. మరి అలాంటిది ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మాయిలు.. అదీ ఇంట్లోనే చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే మాటలా? కానీ ఈ ఐదుగురు తోబుట్టువులు అరుదైన ఘనత సాధించారు.

రాజస్థాన్‌ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఆర్‌ఏఎస్‌) పరీక్షలో అన్షు, రీతు, సుమన్‌ ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. వీళ్ల సోదరీ మణులు రోమా, మంజు ఇప్పటికే ఆర్‌ఏఎస్‌ అధికారులు! తాజాగా ఒకే ఇంటి నుంచి ఐదుగురూ ఆర్‌ఏఎస్‌ అధికారులుగా మారారు. ఈ విషయాన్ని ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కాసవాన్‌.. ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ అక్కాచెలెళ్లను అభినందిస్తూ వారి ఫొటోను పోస్ట్‌ చేశారు.

రాజస్థాన్‌ హనుమాన్‌గఢ్‌కు చెందిన సహదేవ్‌ సహారన్‌, లక్ష్మీదేవి అనే రైతు దంపతుల బిడ్డలైన ఈ ఐదుగురూ అయిదో తరగతి తరువాత బడి, కాలేజీ గుమ్మం తొక్కలేదు. కారణం ఊళ్లో ఉన్నత పాఠశాల లేదు. పిల్లల్ని వేరే ఊరికి పంపి చదివించే స్థోమత సహదేవ్‌కు లేదు. దాంతో పెద్ద అమ్మాయిలు రోమా, మంజు సొంతంగా ఇంట్లోనే చదువుకున్నారు. వాళ్లు ఇద్దరూ కోఆపరేటివ్‌ బ్యాంకులో అధికారులు. వారి మార్గ దర్శకత్వంలో మిగిలిన ముగ్గురు అమ్మాయిల చదువులూ ఇంట్లోనే సాగాయి. వారి స్ఫూర్తితో ఇప్పుడు ఒకే సారి రాత, మౌఖిక పరీక్షలకు హాజరై ఉద్యోగాలూ సాధించారు.

ఆర్‌ఏఎస్‌ 2018 ఫలితాలను రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఆర్‌పీఎస్‌సీ) మంగళవారం విడుదల చేసింది. ఆర్‌ఏఎస్‌ టాపర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. ట్విటర్‌లో అభినందించారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు వారికిది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ అక్క చెల్లెళ్లను గురించిన ట్వీట్‌కు 6 వేలకుపైగా లైకులు వచ్చాయి. వీరిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్