లక్ష మంది ఆకలి తీర్చింది!
పెద్ద సంస్థలు, ఆకర్షించే భవనాలు, అందివస్తున్న అవకాశాలు.. భవిష్యత్ నిర్మించుకోవచ్చనుకుంది. కానీ ఇంకోవైపు కాలే కడుపులు, ఒక్క పూట తిండి కోసం ఎదురుచూసే చిన్నారులుండటం గమనించింది. వాళ్ల మొహాల్లో వృథా చేస్తున్న ఆహారం కనిపించింది. దాన్ని సేకరిస్తే వీళ్ల కడుపు నింపొచ్చనుకుంది.
పెద్ద సంస్థలు, ఆకర్షించే భవనాలు, అందివస్తున్న అవకాశాలు.. భవిష్యత్ నిర్మించుకోవచ్చనుకుంది. కానీ ఇంకోవైపు కాలే కడుపులు, ఒక్క పూట తిండి కోసం ఎదురుచూసే చిన్నారులుండటం గమనించింది. వాళ్ల మొహాల్లో వృథా చేస్తున్న ఆహారం కనిపించింది. దాన్ని సేకరిస్తే వీళ్ల కడుపు నింపొచ్చనుకుంది. సనా అరోరాకి వచ్చిన ఆ ఆలోచన.. నాలుగేళ్లలో లక్షకుపైగా పేదల ఆకలి తీర్చింది.
సనా అరోరా కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్‌లో ఎంబీఏ చేసింది. ఈమెది చండీగఢ్. ముంబయి తన కలల నగరం. అక్కడ ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ, ఆకర్షణీయమైన నగర జీవితాన్ని గడపాలన్నది ఆమె కల. అది 2012.. అనుకున్నట్టుగానే బ్రాండ్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. సరదాగా నగర వీధుల్లో తిరిగొద్దామనుకుని బయల్దేరింది. పెద్ద భవంతులు, విలాస జీవితం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓ చోట కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది పిల్లలను గమనించింది. ఒక పిల్లాడు ఆకలేస్తోందని పొట్ట చూపుతూ సైగలు చేయడం ఆమెను కదిలించింది. తన దగ్గరున్న వాటిని వాళ్లకి ఇచ్చేసింది.
ఆరోజు నుంచి ఆఫీసుకి వెళ్లి వచ్చే దారిలో తరచూ ఆకలితో అలమటించే ఎంతోమంది పిల్లల్ని చూసేది. అప్పుడే ఓవైపు తళుకుమని మెరిసే నగర జీవితంతోపాటు ఒక్కపూట గడవని జీవితాలూ ఉన్నాయని అర్థమైంది. ఆకలేస్తోందని చెప్పలేక కడుపులు చూపించే చిన్నపిల్లల్ని చూస్తే బాధేసేది. ఓపక్క ఆహారం ఎక్కువై పడేసే వారుంటే ఒక్కపూట తిండి కోసం తపన పడుతుండటం ఆమెను కదిలించింది. వాళ్ల మొహాల్లో ఆ వృథా చేస్తున్న ఆహారమే కనిపించేది. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆ వృథా అవుతున్న ఆహారాన్నే సేకరించి వీళ్లకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. రోజూ తన, పక్క ఇళ్లలో రాత్రి మిగిలిన ఆహారాన్ని సేకరించి, వారికివ్వడం మొదలుపెట్టింది. కానీ అది ఎంతో మంది కడుపు నింపలేకపోతోందని సనాకి అర్థమైంది.
స్నేహితుల సాయంతో తను నివసించే చోటుతో పాటు కొన్ని రెస్టరెంట్లతో మాట్లాడి ఆహారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. మొదట చాలామంది వింతగా చూసేవారు. తర్వాత్తర్వాత అర్థం చేసుకుని, వండి మరీ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఎన్నాళ్లిలా అని ఆలోచించింది. రోజూ ఇవ్వడమంటే అందరికీ ఇబ్బందే. పైగా రోజూ ఆహారం మిగులుతుంటుందని చెప్పలేం. వాతావరణం బాగా లేని సందర్భాల్లో సేకరణ, పంచడం రెండూ ఇబ్బందయ్యేవి. వంట సామగ్రిని వారికే అందజేస్తే అవసరాన్నిబట్టి వాళ్ల ఆహారాన్ని వాళ్లే ప్లాన్ చేసుకుంటారనిపించింది. 2017లో ‘ఫీడెమ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా వేల మంది నిస్సహాయులు, ఇల్లు లేనివారు, రాత్రి బడుల్లో చదివేవారికి, వృద్ధులకు వంట సామగ్రిని రేషన్‌గా ఇవ్వడం ప్రారంభించింది. రాత్రి బడుల్లో హాజరు బాగున్న వారికి రివార్డులనూ ఇచ్చేది. వీటికి నిధులను తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి సేకరించింది. అప్పుడప్పడూ ఫుడ్ డ్రైవ్‌లను నిర్వహించి, సేకరించేది. అలా ఇప్పటివరకూ 100కుపైగా డ్రైవ్‌లను నిర్వహించింది.
ఓపక్క ఉద్యోగం చేస్తూనే వీటినీ నిర్వహిస్తోంది. భర్త ఓంకార్ భట్ కూడా ఆమెకు తోడుగా నిలుస్తున్నారు. సనా ప్రస్తుతం మహీంద్రా రైజ్‌లో ఇన్నొవేషన్ మేనేజర్‌గా చేస్తోంది. ఈమె సేవలను గుర్తించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2018 నుంచి గ్లోబల్ షేపర్గా ఎంపిక చేస్తోంది. సనా స్ఫూర్తితో వెయ్యిమందికి పైగా వాలంటీర్లూ ఆమెకు తోడయ్యారు. కొంతమంది డ్రైవ్‌ల నిర్వహణలోనూ మరికొంతమంది పేదలను గుర్తించి వాటిని పంచడంలోనూ సాయపడుతున్నారు. అలా తన సంస్థ ప్రారంభమైన ఈ నాలుగేళ్లలో లక్షమందికి పైగా ఆహారాన్ని అందించింది. ‘ఆకలి విలువ నాకు తెలుసు. ఎవరైనా ఒక ముద్ద పెట్టకపోతారా అని చూసే వారి జాలి చూపులే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేలా చేశా’యంటుంది సనా. ఆమె అర్థం చేసుకోవడంతోపాటు మరెందరికో దాని విలువను తెలియజేసి.. సాయానికి ముందుకు రప్పించడం అభినందనీయమే కదూ!
అనుకున్నది సాధించేంతవరకూ ప్రయత్నిస్తూనే ఉంటాను. అంతవరకూ ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మధ్యలో జరిగే పొరపాట్లు కూడా నాకు పాఠాలే.
- శిఖా శర్మ, ఆర్థికవేత్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!