సమంతా ‘శ్రుతి’ కలిపింది

‘సాకీ’ పేరు వినగానే అరే... సమంత అక్కినేని వస్త్ర వ్యాపార సంస్థ కదా అనిపించిందా! అవును... కానీ దీని స్థాపనలో ఇంకో అమ్మాయి పాత్రా ఉంది. తనే... సుశ్రుతి కృష్ణ. ఆమెవరో.. వారి కలయిక ఎలా సాధ్యమైందో తెలుసుకుందామా!

Published : 22 Jul 2021 01:39 IST

‘సాకీ’ పేరు వినగానే అరే... సమంత అక్కినేని వస్త్ర వ్యాపార సంస్థ కదా అనిపించిందా! అవును... కానీ దీని స్థాపనలో ఇంకో అమ్మాయి పాత్రా ఉంది. తనే... సుశ్రుతి కృష్ణ. ఆమెవరో.. వారి కలయిక ఎలా సాధ్యమైందో తెలుసుకుందామా!

సుశ్రుతిపై వాళ్ల అమ్మ ప్రభావమెక్కువ. ఆమె చాలా కాలం వ్యాపార రంగంలో ఉన్నారు. సుశ్రుతినీ సొంతంగా ఏదైనా చేయమని ప్రోత్సహించే వారు. ఆ స్ఫూర్తితో సుశ్రుతి ఆర్కిటెక్చర్‌ చదివేటపుడు హోమ్‌ డెకార్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ప్రారంభించాలనుకుంది. 2016లో అనుకోకుండా ఫెమినా మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లి రన్నరప్‌గా నిలిచింది. అప్పుడే ఫ్యాషన్‌ రంగంపై అవగాహనా వచ్చింది. తారల ప్రభావమూ అర్థమైంది. దాంతో తారలు, ప్రాచుర్యం ఉన్నవారి నేతృత్వంలో నడిచే (ఇన్‌ఫ్లుయెన్సర్‌/ సెలెబ్రిటీ లెడ్‌) బ్రాండ్‌లను రూపొందించాలనుకుంది.

గత ఏడాది ఏప్రిల్‌లో సాకీ కింద తొలి బ్రాండ్‌గా ‘మెర్క్‌’ను ప్రారంభించింది. దీని ద్వారా ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, ఇతర అంశాల్లో వివిధ బ్రాండ్‌లను అందుబాటులో ఉంచాలన్నది ఆలోచన. ‘ఎథినిక్‌, ఫ్యూజన్‌ వేర్‌ల టర్నోవర్‌ కోట్లలో ఉంది. ఆన్‌లైన్‌లో ఉన్న బ్రాండ్‌లూ తక్కువ. సెలబ్రిటీ కోణంలో ఆన్‌లైన్‌లో అందిస్తున్నవీ పెద్దగా లేవు. కాబట్టి ఇదో మంచి అవకాశమనుకున్నా’ అంటోందీ బెంగళూరు అమ్మాయి.

ఓ ఫ్రెండ్‌ ద్వారా సుశ్రుతికి సమంత పరిచయం అయ్యింది. తన ఆలోచన బాగా నచ్చి సమంత కోఫౌండర్‌గా నిలిచింది. ఆలోచనలు, ప్రచారానికే పరిమితం కాకుండా సమంత వాటిని రోజూ ఉపయోగిస్తోందట. ఈ దుస్తులను యూఎస్‌ఏ, మలేషియా, సింగపూర్‌, కెనడా, ఆస్ట్రేలియాలతోపాటు యూరోపియన్‌ దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మొదటి ప్రయత్నమే విజయవంతమవడం సమంతకీ ఆనందాన్నిస్తోందంటోంది సుశ్రుతి. సో.. ఇదండీ.. సాకీ వెనుక కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్