తెలుగు, తమిళం నేర్పించే బెంగాలీ భామ
తెలుగువాళ్లు తెలుగు కంటే ఆంగ్లం మాట్లాడ్డానికి మోజు చూపుతుంటే బెంగాలీ యువతి అభిలాషా ఛటర్జీ మాత్రం తెలుగు నేర్చుకోవడమే కాదు, నేర్పిస్తూ పిల్లల్నీ, పెద్దల్నీ కూడా ఆకట్టుకుంటోంది...
తెలుగువాళ్లు తెలుగు కంటే ఆంగ్లం మాట్లాడ్డానికి మోజు చూపుతుంటే బెంగాలీ యువతి అభిలాషా ఛటర్జీ మాత్రం తెలుగు నేర్చుకోవడమే కాదు, నేర్పిస్తూ పిల్లల్నీ, పెద్దల్నీ కూడా ఆకట్టుకుంటోంది...
పశ్చిమ బంగలో పుట్టిపెరిగిన అభిలాషా ఛటర్జీ ‘హాట్‌స్టార్’లో రిక్రూటర్‌గా ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది. నగరం నలుమూలల నుంచీ వచ్చినవాళ్లతో పరిచయాలయ్యాయి. ముఖ్యంగా తమిళులు, తెలుగువాళ్లతో అనుబంధం ఏర్పడింది. అంతకుమించి తెలుగు, తమిళ పాటలు తెగ నచ్చేయడంతో ఆ భాషలంటే ఇష్టం ఏర్పడింది. ఇక రెండింట్లోంచీ కొన్ని పదాల చొప్పున నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒకేసారి ఎక్కువెక్కువ కానందున భారమనిపించక సరదా సరదాగా నేర్చేసుకుంది.
లాక్డౌన్లో ఏదైనా మంచిపని చేయాలని ఆలోచిస్తున్నప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ప్రాథమిక సూత్రాలు ఇతర భాషలవాళ్లకి నేర్పిస్తే బాగుంటుంది.. అనుకుంది. పైగా తాను బెంగాలీ అయ్యుండి పరభాష నేర్పడం ఆసక్తి కలిగిస్తుంది అనిపించింది. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘భాష విత్ అభిలాష’ పేజీ క్రియేట్ చేసింది. ఆమె అంచనా తప్పకపోగా, ఆశ్చర్యకరంగా మర్నాటికే 46 వేలమంది ఫాలోవర్స్ వచ్చారు.
‘తెలుగు, తమిళాల్లో నా ఉచ్చారణ గొప్పగా నిర్దుష్టంగా ఉంటుందని నేను చెప్పను. ఇప్పటికీ సుదీర్ఘ సంభాషణలు సాగించాలంటే కొంచెం కష్టమే. నేనింకా నేర్చుకోవాల్సి ఉన్నా వచ్చినంతలో స్వచ్ఛంగా, స్పష్టంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది. చాలామంది తెలుగువాళ్లతో స్నేహం ఉన్నందున అది నేర్చుకున్నాను. ఇక తమిళం ఎందుకంటే అది వినసొంపుగా ఉంటుంది. తెలుగు-కన్నడ, తమిళం-మలయాళం దగ్గరగా ఉన్నప్పటికీ ఆ రెండు భాషలూ రావు. ముఖ్యంగా మలయాళం నేర్చుకోవడం చాలా క్లిష్టమనిపిస్తుంది’ అంటోంది.
మూడు నెలల క్రితం తన వీడియో ఒకటి 17 లక్షల వీక్షణలు దాటడం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అని గిల్లి చూసుకుంది. కేవలం వ్యూస్ పెరగడమే కాదు ఎందరో పెట్టే మెసేజ్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఒక తమిళమ్మాయి తన అత్తగారిని ఆకట్టుకోడానికి తెలుగు నేర్చుకుంటోంది. 56 ఏళ్ల గుజరాతీ మహిళ తన కొడుకు చేసుకోబోయే అమ్మాయితో మనసులో మాటలు పంచుకోడానికి తెలుగు నేర్చుకుంటోంది. ఇంకా చిన్నచిన్న పదాలు కూడా రాని తమ పాపాయి ఈ వీడియోలు చూస్తూ అచ్చం అలా పలుకుతోంది. ఇలాంటి సందేశాలు చూసి మురిసిపోయే అభిలాష.. ‘నేను చెప్పేదల్లా ఒక్కటే.. నా వీడియోలతో మీకు తెలుగు, తమిళం అద్భుతంగా వచ్చేస్తాయని, పండితులైపోతారని చెప్పను. కానీ ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పనిమనిషి, వంటమనిషి, ఆటో డ్రైవర్లతో తేలిగ్గా మాట్లాడగలరు. షాప్‌కి వెళ్లి అవసరమైనవి అడగగలరు’ అంటుంది. లాక్డౌన్లో పనికొచ్చే పనే చేసింది కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!