భరత నాట్యంతో 101 ఆసనాలు

ఆసక్తితో మొదలు పెట్టిన యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకుంది ప్రసన్న. అంతేనా భరతనాట్యం చేస్తూ 13 నిమిషాల్లో 101 ఆసనాలు వేసి ఔరా అనిపిస్తోందీ కర్నూలు అమ్మాయి...

Published : 29 Jul 2021 01:45 IST

ఆసక్తితో మొదలు పెట్టిన యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకుంది ప్రసన్న. అంతేనా భరతనాట్యం చేస్తూ 13 నిమిషాల్లో 101 ఆసనాలు వేసి ఔరా అనిపిస్తోందీ కర్నూలు అమ్మాయి...
హేమావతి, వాసుదేవనాయుడుల ముగ్గురు సంతానంలో చివరి అమ్మాయి ప్రసన్న. తండ్రి చిరుద్యోగి. ఆరో తరగతిలో యోగా నేర్చుకోవాలన్న తన అభిలాషను అమ్మానాన్నలకు చెప్పింది. ఓ గురువు వద్ద ఓనమాలు నేర్చుకుని, క్రమంగా పట్టు సాధించింది ప్రసన్న. ఏడో తరగతి నుంచే జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చి పతకాలను సొంతం చేసుకుంది. పోయినేడాది ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ యోగా పోటీల్లో విజేతగా నిలిచింది. అందరిలా యోగాసనాలు వేస్తే పెద్దగా గుర్తింపు ఉండదని ప్రసన్న భావించింది. ప్రత్యేకంగా సాధన చేయడం మొదలు పెట్టింది. మొదట ఆంగ్ల అక్షరాలు, అంకెల ఆకారంలో యోగాసనాలను వేసి అబ్బురపరచింది. ఈటీవీ ప్లస్‌ ఛానల్‌ నిర్వహించిన ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’ కార్యక్రమంలో అద్భుత ప్రతిభతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత మరింత సాధనతో భరత నాట్యం చేస్తూ 101 ఆసనాలు వేస్తోంది. అదీ కేవలం 13 నిమిషాల్లోనే. ప్రసన్న ప్రతిభను గుర్తించి స్కూలు యాజమాన్యం పదో తరగతి ఉచితంగా చదువుకునే అవకాశాన్ని కల్పించింది. తన ప్రతిభను చూసి ఓ కార్పొరేట్‌ కళాశాల ఇంటర్‌లోనూ ఉచితంగా చదివే అవకాశాన్ని కల్పించింది. ఇంటర్‌లో 938 మార్కులు సాధించింది ప్రసన్న. ప్రస్తుతం వాసవీ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్