తన కల... పర్యావరణహితం

పర్యావరణహిత పాత్రలు అనగానే మట్టి, ఇనుము, సెరామిక్‌.. ఇలా వివిధ రకాలవి గుర్తొస్తాయి కదూ! వాటిలోకి కొబ్బరి చిప్పల్నీ చేర్చిందో అమ్మాయి. తనే మరియా కురియకోజ్‌.. వాటితో వివిధ రకాల గిన్నెలు, గ్లాసులు, కప్‌లు, గరిటెలు, చెంచాలు, కుండీలు చేస్తోంది.

Published : 11 Aug 2021 01:35 IST

పర్యావరణహిత పాత్రలు అనగానే మట్టి, ఇనుము, సెరామిక్‌.. ఇలా వివిధ రకాలవి గుర్తొస్తాయి కదూ! వాటిలోకి కొబ్బరి చిప్పల్నీ చేర్చిందో అమ్మాయి. తనే మరియా కురియకోజ్‌.. వాటితో వివిధ రకాల గిన్నెలు, గ్లాసులు, కప్‌లు, గరిటెలు, చెంచాలు, కుండీలు చేస్తోంది. ఎంబీఏ చదివి, ఎంఎన్‌సీలో పనిచేసిన ఈమెకు అది సంతృప్తినివ్వ లేదు. తర్వాత ఓ ఎన్‌జీఓతో కలిసి మురికివాడల్లో ఉన్న వారికి ఉపాధి కల్పించడం మొదలు పెట్టింది. అప్పుడు అనుకోకుండా ఈ ఆలోచన వచ్చింది. నాన్నతో చెబితే మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన ఆయన యంత్ర పరికరాలను తయారు చేసిపెట్టాడు. ‘తేంగా (కొబ్బరికాయ)’ పేరిట సంస్థను ప్రారంభించి, ఈకామర్స్‌ సైట్‌లలోనూ తన ఉత్పత్తుల్ని ఉంచింది. దీని ద్వారా 10 మంది హస్త కళాకారులతోపాటు మురికివాడల వాళ్లకీ ఉపాధినిస్తోంది. ఓ సంస్థను స్థాపించి నలుగురికీ ఉపాధినివ్వాలన్న చిన్ననాటి కలనీ ఇలా నిజం చేసుకుంటోందీ కేరళ అమ్మాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్