బుర్జ్‌ ఖలీఫా.. ఎక్కేసింది!

ఒక ఎయిర్‌హోస్టెస్‌.. తన సంస్థ గురించి చెబుతూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తోంది. అవి పూర్తవగానే కెమెరా ఆమె ముఖం మీద నుంచి దూరంగా జరుగుతూ వెళుతోంది. చూసే కొద్దీ ఆమె నిల్చున్నది ఓ ఎత్తైన భవనంపై అని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయిన

Updated : 11 Aug 2021 14:01 IST

ఒక ఎయిర్‌హోస్టెస్‌.. తన సంస్థ గురించి చెబుతూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తోంది. అవి పూర్తవగానే కెమెరా ఆమె ముఖం మీద నుంచి దూరంగా జరుగుతూ వెళుతోంది. చూసే కొద్దీ ఆమె నిల్చున్నది ఓ ఎత్తైన భవనంపై అని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయిన ఈ వీడియో ఓ విమానయాన సంస్థకు చెందిన యాడ్‌ ఇది. అదంతా గ్రాఫిక్స్‌ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే!

ఎమిరేట్స్‌ ప్రతినిధులు యూఏఈ నుంచి యూకేకి ప్రయాణాలు పునరుద్ధరించడంతో ఓ యాడ్‌ తీయాలనుకున్నారు. అందుకు ప్రదేశంగా..ప్రపంచ అతిపెద్ద కట్టడం బుర్జ్‌ ఖలీఫా (828 మీటర్లు)నూ యూకేకు చెందిన నికోల్‌ స్మిత్‌ లడ్విక్‌ను నటించడానికీ ఎంచుకున్నారు. ఈమె స్కైడైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌. వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేయగానే ఎంతోమందిని ఆకట్టుకోవడంతోపాటు ఇదంతా గ్రాఫిక్స్‌ అనే కామెంట్లూ వచ్చాయి. కానీ సంస్థ ఇంకో వీడియోను విడుదల చేసింది. బుర్జ్‌ ఖలీఫాలోని 163 ఫ్లోర్స్‌లో 160వ అంతస్తు వరకే లిఫ్ట్‌ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి స్కైస్క్రేపర్‌ వరకు నడకే మార్గం. చేరడానికే గంట పట్టింది. ఆపైన నికోల్‌ చేసిన ప్రాక్టీస్‌, డ్రోన్‌తో తీసిన విధానం మొదలైనవన్నీ దీనిలో చూపించారు. కిందపడకుండా ఏర్పాటు చేసిన హుక్‌ మినహా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లుకానీ, గ్రీన్‌మ్యాట్‌ సహా వేటినీ దీనిలో ఉపయోగించలేదు. దీంతో అసలు దానికంటే ఇది మరింత వైరల్‌ అవుతోంది. అంతేకాదు.. ఆ అమ్మాయి తెగువకు పొగడ్తలతోపాటు ‘ఆమె అక్కడ నిల్చోవడం చూస్తేనే గుండె కొట్టుకునే వేగం రెట్టింపవుతోంది. మేము నిలబడాలన్న ఆలోచనకే భయపడతా’మంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ నికోల్‌ మాత్రం.. ‘నేను ఇప్పటివరకూ చేసిన స్టంట్‌ల్లో ఇదే అత్యుత్తమం. చేస్తూ ఎంత ఎంజాయ్‌ చేశానో చెప్పలేను’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్