పతకం రజతం... మనసు బంగారం

చేసిన మేలు మరవకూడదంటారు. ఈమాటల్ని ఆచరణలో చూపింది ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాచాను. ఓ పక్క స్నేహితులు, బంధువులు, క్రీడాభిమానులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతుంటే ఆమె మాత్రం తనకు సాయం చేసిన ఇసుక లారీడ్రైవర్లని వెతికే పనిలో పడింది. చేతిలో డబ్బుల్లేక ఇంటి నుంచి ఇంఫాల్‌లో ఉన్న ట్రైనింగ్‌ అకాడమీకి లారీ డ్రైవర్లని లిఫ్ట్‌ అడిగి వాటిలో వెళ్లేది....

Published : 12 Aug 2021 02:47 IST

చేసిన మేలు మరవకూడదంటారు. ఈమాటల్ని ఆచరణలో చూపింది ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాచాను. ఓ పక్క స్నేహితులు, బంధువులు, క్రీడాభిమానులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతుంటే ఆమె మాత్రం తనకు సాయం చేసిన ఇసుక లారీడ్రైవర్లని వెతికే పనిలో పడింది. చేతిలో డబ్బుల్లేక ఇంటి నుంచి ఇంఫాల్‌లో ఉన్న ట్రైనింగ్‌ అకాడమీకి లారీ డ్రైవర్లని లిఫ్ట్‌ అడిగి వాటిలో వెళ్లేది. అలా తాను సాయం పొందిన 150 మంది డ్రైవర్లని వెతికి పట్టుకుని మరీ వాళ్లందరికీ మంచి భోజనం పెట్టింది. కొత్త బట్టలూ, మణిపురి స్కార్ఫ్‌లను బహుమతిగా ఇచ్చి కృతజ్ఞతలు చెప్పింది. ‘ఇంఫాల్‌కి వెళ్లే లారీలన్నీ మా టీకొట్టు మీదుగానే వెళ్లేవి. డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే వాళ్లంతా చానుకి లిఫ్ట్‌ ఇచ్చే వారు. వాళ్ల మేలుని మరిచిపోలేదు. అందుకే వాళ్ల రుణం ఇలా కొంతైనా తీర్చుకుంది’ అంటోంది చాను వాళ్లమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్