మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌గా జోయా అఫ్రోజ్‌

‘మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 2021’ కిరీటాన్ని ముంబయికి చెందిన 26 ఏళ్ల అందాల భామ జోయా అఫ్రోజ్‌ దక్కించుకుంది. గ్లామానంద్‌ సూపర్‌మోడల్‌ ఇండియా పేరుతో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జోయా, ఈ ఏడాది నవంబరులో జపాన్‌లో నిర్వహించనున్న ‘మిస్‌ ఇంటర్నేషనల్‌ 2021’ పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది

Updated : 25 Aug 2021 07:01 IST

‘మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 2021’ కిరీటాన్ని ముంబయికి చెందిన 26 ఏళ్ల అందాల భామ జోయా అఫ్రోజ్‌ దక్కించుకుంది. గ్లామానంద్‌ సూపర్‌మోడల్‌ ఇండియా పేరుతో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జోయా, ఈ ఏడాది నవంబరులో జపాన్‌లో నిర్వహించనున్న ‘మిస్‌ ఇంటర్నేషనల్‌ 2021’ పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మూడేళ్ల వయసులోనే బాలనటిగా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన జోయా బాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల్లోనూ మెరుస్తోంది. వెబ్‌ సిరీసుల్లోనూ పేరు తెచ్చుకుంటున్న తను పాండ్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ వంటి ప్రముఖ సంస్థలకు మోడల్‌ కూడా. 2013లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీలో రెండో రన్నరప్‌గా నిలిచిన ఈమె, తాజాగా ‘మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 2021’తోపాటు ‘బెస్ట్‌ ఇన్‌ ఈవెనింగ్‌ గౌన్‌’, ‘మిస్‌ గ్లామరస్‌ ఐస్‌’, ‘టాప్‌ మోడల్‌’ సబ్‌ టైటిల్స్‌నూ సొంతం చేసుకుంది. ‘మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం’ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కలిగించే దిశగా ఈమె కృషి చేయనుంది. ‘ప్రతి స్త్రీకి తన కలను సాకారం చేసుకునే హక్కు ఉంది. దాన్ని సాధించడం కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటున్న జోయా ‘మిస్‌ ఇంటర్నేషనల్‌ 2021’ కిరీటాన్ని దక్కించుకోవాలని ఆశిద్దాం.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్