బొగ్గు గనిలో మొదటి  మైనింగ్‌ ఇంజినీర్‌ ఆమె!

మహిళలు ఒక్కోరంగంలో అడుగుపెడుతూ అడ్డుగోడల్ని బద్దలు కొడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్‌కి చెందిన ఆకాంక్షాకుమారి అలాంటి అరుదైన ఘనతను సాధించింది. నాలుగున్నర దశాబ్దాల కోల్‌ఇండియా ప్రస్థానంలో భూగర్భ గనుల్లో విధులు నిర్వర్తించనున్న మొదటి భారతీయ మహిళా మైనింగ్‌ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమెది ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలోని బార్కాగావ్‌

Updated : 02 Sep 2021 04:47 IST

హిళలు ఒక్కోరంగంలో అడుగుపెడుతూ అడ్డుగోడల్ని బద్దలు కొడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్‌కి చెందిన ఆకాంక్షాకుమారి అలాంటి అరుదైన ఘనతను సాధించింది. నాలుగున్నర దశాబ్దాల కోల్‌ఇండియా ప్రస్థానంలో భూగర్భ గనుల్లో విధులు నిర్వర్తించనున్న మొదటి భారతీయ మహిళా మైనింగ్‌ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమెది ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలోని బార్కాగావ్‌. నవోదయ విద్యాలయం నుంచి ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆకాంక్ష పుట్టి పెరిగిన ప్రాంతం మైనింగ్‌ బెల్ట్‌లో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచీ బొగ్గు తవ్వకాలను చూస్తూ పెరిగింది. ఇందులోనే కెరీర్‌ని వెతుక్కోవాలనుకుంది. ఆ దిశగానే  సింద్రీలోని బిట్స్‌లో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో చేరడానికి ముందు ఆకాంక్ష రాజస్థాన్‌లోని హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌కు చెందిన బలేరియా గనుల్లో మూడేళ్లు పనిచేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని ఉత్తర కరన్‌పురా ప్రాంతంలో ఉన్న చురి బొగ్గు గనుల్లో పని చేయనుంది. ‘మనం మనసుపెట్టి చేయాలనుకుంటే ఏ రంగంలో అయినా రాణించగలం, ఎలాంటి అటంకాలనైనా అధిగమించగలం’ అంటోన్న ఆకాంక్ష విజయం మరింత మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుందాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్