మోడలింగ్ మారింది..
అందమైన భామలు ఒయ్యారంగా వేదికపై నూతన డిజైన్లను ప్రదర్శించే మోడలింగ్ పద్ధతి ఇప్పుడు మారింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ తాజాగా ఓ మోడల్ ఏకంగా చెత్తకుప్పల మధ్య అడుగులేస్తే, మరొకామె...
అందమైన భామలు ఒయ్యారంగా వేదికపై నూతన డిజైన్లను ప్రదర్శించే మోడలింగ్ పద్ధతి ఇప్పుడు మారింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ తాజాగా ఓ మోడల్ ఏకంగా చెత్తకుప్పల మధ్య అడుగులేస్తే, మరొకామె మహిళలంటే సాహసానికి ప్రతీక అంటూ గగనపు వీధిలో విహరించింది. ఒకరు 16 ఏళ్ల సురభి అయితే... రెండో వ్యక్తి 36 ఏళ్ల డొమిటిల్లే లక్ష్మీ కైజర్. ఈ ఇద్దరి సాహసాలూ చూడండి...
అవగాహన కోసం...
ఝార్ఖండ్‌కు చెందిన సురభి ఇంటర్ రెండో ఏడు చదువుతోంది. ఆసక్తితో మోడలింగ్‌లోనూ అడుగు పెట్టింది. అందమైన దుస్తులను ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా, ఓ మంచి సందేశం ఇచ్చేలా మోడలింగ్ ఉండాలంటుంది సురభి. ‘ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. పేరుకు పోతున్న వ్యర్థాలు ప్రజారోగ్యాన్ని కలుషితం చేస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లోని నివాసప్రాంతాల మధ్య ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంప్ అవుతోంది. దీనివల్ల చుట్టుపక్కల వారంతా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగించేందుకే ఈ క్యాట్‌వాక్. రాంచీలో రోజూ సేకరించే చెత్తను వేసే ఝిరి డంపింగ్ యార్డ్ సమీపంలో 10వేల మందికి పైగా పదేళ్ల నుంచి నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలని ఆ చెత్త కుప్పల మధ్య అడుగులేశా. ఆసుపత్రి వ్యర్థాలు, జంతు కళేబరాలు, ఇళ్ల వ్యర్థాల నుంచి వచ్చే తీవ్ర దుర్వాసనల మధ్య నడిచిన నాపై అక్కడ పలు విష కీటకాలు దాడి చేశాయి. ఈ షూట్ పూరయ్యాక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కొన్ని గంటలకే అలా అయితేే, అక్కడే నివసిస్తున్న వారి గురించి ఆలోచిస్తేనే చాలా బాధేస్తోంది. నా వాక్ వీడియో వైరల్ అయ్యింది. ఇలాగైనా అందరిలోనూ కాలుష్యం పట్ల అవగాహన వస్తుందని ఆశిస్తున్నా’ అంటున్న సురభి పలు సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేలా కృషి చేస్తోంది. ‘ఫ్యాషన్ ఫర్ ఎ గుడ్ ఛేంజ్’, ‘నారీ’ పేరుతో ప్రాజెక్టులను చేపట్టింది. మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న దాడి వంటి అంశాలపై ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ద్వారా అవగాహన అందించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ‘మిస్ టీన్ దివా’ పోటీల్లో ఝార్ఖండ్ నుంచి రంగంలోకి దిగబోతోంది.
సాహసం...
‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఫాల్ వింటర్ 21-22 ఎర్త్ రైజ్ కలెక్షన్’లో భాగంగా వినూత్న స్కై వాక్ నిర్వహించారు. ఇందులో స్కైడైవర్ కైజర్ పొడవాటి నీలి గౌనులో విమానం నుంచి డైవ్ చేసి వినువీధుల్లో విహరిస్తూ మెల్లగా నేలకు దిగింది. ‘ఇంత అందమైన అనుభవాన్ని పొందడం సంతోషంగా ఉంది. దీనికోసం చాలా కష్టపడ్డా’ అని వివరించింది కైజర్. ‘సాధారణంగా హెల్మెట్, ప్రత్యేక జంప్ సూట్ ధరించి స్కైడైవింగ్ చేస్తా. ఇలా ఫ్యాషన్ గౌనుతో గాలిలో విహరించడం కష్టమైన విషయం. ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు నా అనుభవం మేరకు పైన ఉండే గాలి ఒత్తిడి గురించి డిజైనర్‌కు వివరించా. దానికి తగినట్లుగా దుస్తులను రూపొందించాలని సూచించా. ముందు ప్యారిస్, ఇంగ్లండ్‌లో మూడు సార్లు సాధారణ జంప్ సూట్లో రిహార్సల్స్ చేశాం. నాలుగో సారి గౌను ధరించి రిహార్సల్ చేశా. ఈ కార్యక్రమంలో నా మేకప్, హెయిర్ స్టైల్‌కు మూడుగంటలకు పైగా పట్టింది. నా ముందు కెమెరామ్యాన్ ఎగురుతుంటే నేను గాల్లోకి దూకాను. ఇలా మూడుసార్లు డైవింగ్ చేస్తే కానీ చక్కటి వీడియో రాలేదు’ అంటున్న కైజర్ బాల్యం రాజస్థాన్‌లోని షెకావతిలో గడిచింది. తండ్రి ఉద్యోగరీత్యా ఇటలీకి చేరుకుంది ఈమె కుటుంబం. విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తి చేసింది. నింగిలో ఎగరాలనే ఆసక్తి ఈమెను స్కైడైవింగ్ రంగంలో అడుగుపెట్టేలా చేసింది. మోడల్‌గా రాణిస్తూనే, డైవర్ గానూ నైపుణ్యం సంపాదించింది. అంతే కాదు... శిక్షకురాలిగానూ ఎదిగింది. ఈ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న కైజర్ ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ కమిషన్, ఫ్రెంచ్ స్కైడైవింగ్ ఫెడరేషన్ సభ్యురాలు కూడా. డైనమిక్ ఫ్లైయింగ్గా పిలిచే ఇండోర్ స్కైడైవింగ్‌లో అంతర్జాతీయ పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!