అతివల రక్షణకు

మహిళలపై ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ అఫ్గాన్‌లో తాలిబన్లు... తమ నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారు. తాజాగా రేడియోల్లో, టీవీ కార్యక్రమాల్లో ఆడవారి గొంతు వినిపించకూడదని ఆజ్ఞ జారీ చేశారు. ప్రాణభయంతో దేశం వీడి...

Published : 06 Sep 2021 01:21 IST

హిళలపై ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ అఫ్గాన్‌లో తాలిబన్లు... తమ నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారు. తాజాగా రేడియోల్లో, టీవీ కార్యక్రమాల్లో ఆడవారి గొంతు వినిపించకూడదని ఆజ్ఞ జారీ చేశారు. ప్రాణభయంతో దేశం వీడి వెళ్లిపోతున్న అఫ్గాన్‌ జాతీయుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న దేశాల్లో కతర్‌ కూడా ఒకటి. ఈ విషయంలో ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి లోల్వా రషీద్‌ మహ్మద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఓ పక్క అఫ్గాన్‌లో... మహిళల హక్కుల్ని అణగదొక్కాలనుకుంటే, మరో ముస్లిం దేశ ప్రభుత్వ మహిళా ప్రతినిధిగా లోల్వా వారిని సంరక్షించే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తుండటం విశేషం. అమెరికన్‌-తాలిబన్‌ శాంతిచర్చలకు కతర్‌ వేదికగా నిలిచినప్పుడు కూడా ఆమె వాటిలో తనదైన పాత్ర పోషించారు. లోల్వా కతర్‌ విదేశీ వ్యవహారాల శాఖకు అధికార ప్రతినిధి కూడా. యూకేలో చదువుకున్న ఆమెకు సైన్స్‌తో పాటు లిటరేచర్‌పైనా మంచి పట్టు ఉంది. ‘దాదాపు మూడు వారాల నుంచి కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్నాం. అయినా ఫర్వాలేదు. మా సోదరులు, సోదరీమణుల్లో వీలైనంత మందిని సురక్షితంగా ఉంచగలిగితే అదే సంతోషం. మహిళలమైనా మన లక్ష్యాలు వాటి సాధన మార్గాలపై స్పష్టత ఉన్నప్పుడు అనుకున్నది చేయగలమ’ని ధీమాగా చెబుతారామె. మూడు లక్షల పైచిలుకు జనాభా ఉండే చిన్న దేశం కతర్‌... ఇప్పటివరకూ సుమారు 50 వేల మంది అఫ్గాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారందరికీ కొవిడ్‌ టీకాలు అందించింది. అందులో ఇరవై వేల మందికి పైగా తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. ఈ కార్యక్రమాల్లో సమన్వయ బాధ్యతలను లోల్వా సమర్థంగా నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్