ఆమె పాటకు కోట్లమంది ఫిదా!
సంగీతానికి భాషతో పనిలేదు. మనసు లోతులను స్పృశించేది ఏదైనా సంగీతమే అని ఆమె మరోసారి నిరూపించింది. ‘మాణికే మాగే హితే...’ అంటూ.. ఆమె గొంతు నుంచి జాలువారుతున్న ఓ ప్రేమగీతం ఇప్పుడు యువతను....
సంగీతానికి భాషతో పనిలేదు. మనసు లోతులను స్పృశించేది ఏదైనా సంగీతమే అని ఆమె మరోసారి నిరూపించింది. ‘మాణికే మాగే హితే...’ అంటూ.. ఆమె గొంతు నుంచి జాలువారుతున్న ఓ ప్రేమగీతం ఇప్పుడు యువతను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఆస్వాదిస్తున్న.. ప్రముఖులంతా ఫిదా అవుతున్న ఈ పాటకు గొంతునందించింది శ్రీలంకకు చెందిన 28 ఏళ్ల యూహానీ డి సెల్వ. సోషల్‌మీడియాలో సంచలనమై, సెలబ్రిటీగా మారిన ఈ ర్యాప్ ప్రిన్సెస్ గురించి కొన్ని సంగతులివి...
కొలంబోకు చెందిన యూహానీ తండ్రి మేజర్ జనరల్ ప్రసన్న డి సెల్వ శ్రీలంకలో సైనికాధికారి. తల్లి దినితి డి సెల్వ ఎయిర్‌హోస్టెస్. అక్కడే డిఫెన్స్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన యూహానీకి చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి. అలా శాస్త్రీయ సంగీతంతోపాటు ర్యాప్, పాప్లోనూ శిక్షణ తీసుకుంది. ఓవైపు చదువుతూనే, ‘యూహానీ’ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి, సొంతంగా ఆల్బమ్‌లు చేయడం మొదలుపెట్టింది. సింహళీయంతోపాటు తమిళంలోనూ ఈమె చేసిన సంగీత ఆల్బమ్‌లు లక్షలాది అభిమానులను సంపాదించిపెట్టాయి.
రోజుకి 12 లక్షలు
మాతృభాషలో ‘మాణికే మాగే హితే’ పాటను గతేడాది జులైలో రికార్డ్ చేసింది యూహానీ. యూట్యూబ్‌లో ఈ ఏడాది మే 22న విడుదల చేయగా, రోజుకి 12 లక్షలమంది పైగా ఈ పాటను చూడటం మొదలుపెట్టారు. అలా వీక్షకుల సంఖ్య పెరుగుతూ.. స్థానికంగానే కాకుండా భారతదేశవ్యాప్తంగా ఈ పాటకు ఫిదా అయినవారి సంఖ్య ఇప్పటికి ఎనిమిది కోట్లకు చేరుకుంది. ఇంటర్నెట్లో ఇది సెన్సేషన్ అయ్యింది. అలాగే ఈమె పాడిన పాట పల్లవిని జత చేసుకుంటూ తమిళం, హిందీ, బెంగాలీ, కొంకణీ, బంగ్లా భాషల్లో పలువురు గాయకులు ఈ గీతాన్ని ఆలపించడం విశేషం. పలుభాషల్లో అనుకరణలూ వస్తున్నాయి. అంతగా అభిమానులను దక్కించుకుని నయా ట్రెండ్‌ను సృష్టించిన యూహానీకి ప్రముఖ మ్యూజిక్ సంస్థల నుంచి ఆహ్వానాలు అందడం విశేషం. అంతేనా... ‘ఈ పాట మనసుకు ఆహ్లాదకరంగా ఉందని, కరోనా గాయాలను మాన్పేలా ఉందంటూ’ ప్రముఖ గాయని ఇమాన్ చక్రవర్తి అభినందించింది. ‘ఆమె తీయని గొంతు నుంచి జాలువారిన ఈ పాట ...గుండె లోతుల్లోంచి వచ్చినట్లుగా అద్భుతంగా ఉందని’ అమితాబ్, పరిణీతి చోప్రా వంటి నటీ నటులు, రోనిత్, అనిర్బాన్, కేషబ్ వంటి సంగీత దర్శకులెందరో తమ ఇన్స్టాగ్రాం పేజీల్లో స్పందించడం ప్రత్యేకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!