చదువు కోసం దేశాన్ని వదిలి...
తాలిబన్ల అరాచకత్వపు చీకటిని చీల్చుకుని వచ్చిన అక్షర దీపాలు ఈ అమ్మాయిలు. పోయిన నెలలో అఫ్గానిస్థాన్ మళ్లీ వాళ్ల చెరలోకి వెళ్లినప్పుడు ప్రాణాలరచేత పట్టుకుని సరిహద్దు దాటారు. ఈ ఆణిముత్యాలు మరెవరోకాదు.. ‘అఫ్గాన్ డ్రీమర్స్’గా అంతర్జాతీయంగా పేరుపొందిన బృందమే... వీరి కృషి, ధైర్యసాహసాలు వెండితెరకెక్కనున్నాయి... వారెవరో, ఏం చేశారో చదవండి...
తాలిబన్ల అరాచకత్వపు చీకటిని చీల్చుకుని వచ్చిన అక్షర దీపాలు ఈ అమ్మాయిలు. పోయిన నెలలో అఫ్గానిస్థాన్ మళ్లీ వాళ్ల చెరలోకి వెళ్లినప్పుడు ప్రాణాలరచేత పట్టుకుని సరిహద్దు దాటారు. ఈ ఆణిముత్యాలు మరెవరోకాదు.. ‘అఫ్గాన్ డ్రీమర్స్’గా అంతర్జాతీయంగా పేరుపొందిన బృందమే... వీరి కృషి, ధైర్యసాహసాలు వెండితెరకెక్కనున్నాయి... వారెవరో, ఏం చేశారో చదవండి...
ఆఫ్గాన్‌లోని హెరాట్పట్టణంలో అదొక మెకానిక్ షెడ్. కార్లను మరమ్మతు చేయడంలో తండ్రికి సాయంగా ఓ అమ్మాయి. ఆమెకు తండ్రి స్ఫూర్తి. తానూ అదే రంగాన్ని ఎంచుకోవాలలని అనుకుంది. మహిళలకు ప్రత్యేక హక్కులుండని ఆ దేశంలో పుట్టినందుకు చదువుపై ఆసక్తి ఉన్నా... బాల్యంలోనే వివాహమైంది ఆ అమ్మాయి తల్లికి. అయితేనేం.. కష్టాలెన్నెదురైనా కూతురి కలలను నిజం చేయాలనుకున్నారా దంపతులు. ఆమెను ఎలక్ట్రానిక్ ఇంజినీర్‌గా చేయడానికి ఆర్థిక. సామాజిక, ప్రభుత్వపరమైన ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నారు. అలా తనకిష్టమైన కెరీర్‌ను సాధించిన ఆ అమ్మాయే... 19 ఏళ్ల సోమాయా ఫరూకీ. తోటి విద్యార్థినులు ఫతేమా ఖాదెరియన్, లిడా అజీజీ, కౌసర్ రోషన్, మరియం రోషన్, సాగర్ సలేహీలతో కలిసి బృందంగా ఏర్పడి ఈమె సాధించిన చిన్నచిన్న విజయాలు... ఆమెరికాకు చెందిన ఓ సేవాసంస్థ స్థాపకురాలు, వ్యాపారవేత్త రోయా మహబూబ్ కంట్లో పడ్డాయి. సమాజ హితానికి ఉపయోగపడే రోబోలను తయారుచేస్తున్న ఆ బృందం ఆశయాలకు రోయా మార్గనిర్దేశకంగా నిలిచింది. వారికోసం 2017లో ‘అఫ్గాన్ గర్ల్స్ రోబోటిక్స్ టీం’ను స్థాపించి, ఆర్థిక చేయూతనందించడం ప్రారంభించింది.
బాంబుపేలుళ్లతో... 2018లో అమెరికాలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఫస్ట్ గ్లోబల్ ఛాలెంజ్ రోబోటిక్స్’ పోటీలకు ఎన్నో కష్టాల మధ్య ఈ బృందం హాజరై తమ సత్తా చాటింది. కొవిడ్ బాధితుల కోసం తక్కువ బరువు, వ్యయంతో వెంటిలేటర్‌ను రూపొందించడానికి ముందడుగు వేసిందీ బృందం. దీనికోసం చాలా కష్టపడ్డా మంటుంది సోమాయా. ‘వర్క్‌షాపును చేరుకోవడానికి రహస్య మార్గాల్లో మా నాన్న మమ్మల్ని కారులో తీసుకెళ్లేవారు. అలా నాలుగు నెలలపాటు మేం పడిన కష్టం విజయ వంతమైంది. కార్ల విడిభాగాలను ఉపయోగించి గతేడాది జులైలో మేం తయారు చేసిన వెంటిలేటర్ నమూనా ప్రయోగాత్మకంగా సిద్ధమైంది. వీటి తయారీకి కావాల్సిన నిధులను దొరికాయి...’ అని వివరించింది సోమాయా.
ఈ ఏడాది ఆగస్టు17న అఫ్గాన్ నుంచి బయటకు రావడానికి ఈ బృందం చేసిన ప్రయత్నాలు మొదట విఫలమయ్యాయి. దాంతో కెనడా ప్రభుత్వ సాయంతో రెండు రోజుల తర్వాత రహస్యంగా కాబూల్‌కు, అక్కడి నుంచి మెక్సికో చేరుకోగలిగారు. చదువుకోసం దేశాన్ని వదులుతున్నామనే బాధున్నా... తిరిగి ఇక్కడికే వచ్చి మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం అని చెబుతోందీమె. వీరి జీవితాన్ని, ప్రయాణాన్ని, సాధించిన విజయాలను కథగా మలిచి వెండితెరకెక్కిస్తున్నారు ప్రముఖ దర్శకుడు డేవిడ్ గ్రీన్వాల్డ్. పలు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి.. అంతర్జాతీయ అవార్డులెన్నో అందుకుని, ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ పట్టికలో ఈ బృందం స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చెమట ఎక్కువగా పడుతోందా?
- జోరుమీదున్నాయి... జిప్ నగలు!
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- స్ట్రెచ్ మార్క్స్‌కి బేకింగ్ సోడా..
- చీరపై... రామ చిత్రాలెన్నో!
ఆరోగ్యమస్తు
- బరువు తగ్గించే ‘బీరకాయ సూప్’!
- 5-9... 9-5 ఈ ట్రెండేంటో తెలుసా!
- చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
అనుబంధం
- ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!
- అపరాధ భావం లేకుండా...
- గర్భస్రావం అయ్యాక..!
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
యూత్ కార్నర్
- తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు... కూతురు అగ్నివీర్!
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- గెలుపు కథ రాసుకున్నారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
'స్వీట్' హోం
- వంటిల్లు పొందిగ్గా
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
వర్క్ & లైఫ్
- ప్రయాణాల కోసం ‘సోప్ పేపర్’!
- నెలసరి కాలుష్యం లేకుండా!
- నిండైన నీల లత అందం!
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!