నాన్న కల... 11 బంగారు పతకాలు
సరిగ్గా పరీక్ష రాస్తున్న సమయంలో తెలిసింది... తనెంతో ఇష్టపడే నాన్న మరణం గురించి. ఆ బాధని గుండెల్లోనే దిగమింగుకుని ఆయన కలని నిజం చేయాలనుకుంది. ఆ లక్ష్యంతోనే కొక్కిరాల తులసీ రుక్మిణి పశువైద్యశాస్త్రంలో 11 బంగారు పతకాలు కైవసం చేసుకుంది.. గుంటూరు జిల్లా బాపట్ల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొక్కిరాల ఏడుకొండలు, పద్మావతి దంపతుల కుమార్తె
సరిగ్గా పరీక్ష రాస్తున్న సమయంలో తెలిసింది... తనెంతో ఇష్టపడే నాన్న మరణం గురించి. ఆ బాధని గుండెల్లోనే దిగమింగుకుని ఆయన కలని నిజం చేయాలనుకుంది. ఆ లక్ష్యంతోనే కొక్కిరాల తులసీ రుక్మిణి పశువైద్యశాస్త్రంలో 11 బంగారు పతకాలు కైవసం చేసుకుంది..
గుంటూరు జిల్లా బాపట్ల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొక్కిరాల ఏడుకొండలు, పద్మావతి దంపతుల కుమార్తె తులసీరుక్మిణి. మధ్యతరగతికి చెందిన తులసి పదోతరగతి వరకు మిషనరీ పాఠశాలలోనూ, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ చదివింది. ‘గొప్ప చదువులు చదవాలి.. సమాజానికి నిస్వార్థంగా సేవ చేయాలన్న’ తండ్రి కలని నిజం చేయడం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల బీవీఎస్సీ (పశుసంవర్థకం)లో సీటు దక్కించుకుంది. 2019లో వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో తులసి తండ్రి ఏడుకొండల్ని కోల్పోయింది. పరీక్ష సగంలో ఆపేసి ఇంటికి వెళ్లింది. ‘నేను సాధించిన ప్రతి విజయాన్నీ నాన్నకు చెబితే ఆయన ఎంతో మురిసిపోయే వారు. అలాంటిది నాన్నే లేరంటే నమ్మలేకపోయాను. అంత్యక్రియలు ముగించుకుని కళాశాలకు చేరుకుని పరీక్షలను రాశాను. కానీ ఆ ఏడాది బాగా రాయలేకపోయా.’ అని జ్ఞాపకం చేసుకునే తులసి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన 10వ స్నాతకోత్సవంలో, ఉపకులపతి డాక్టర్ వి.పద్మనాభరెడ్డి చేతుల మీదుగా 11 బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించి తండ్రికి అంకితం ఇచ్చింది. తులసి సివిల్స్ సాధించాలన్నది తండ్రి కోరిక. అందుకే దాన్ని నెరవేర్చడం కోసం పశువైద్యంలో ఉన్నత విద్యకు వెళ్లకుండా.. సివిల్స్ కోసం ఇంటి నుంచే సిద్ధం అవుతోంది. ‘మా అక్క ఎంఎస్సీ చేసి మేం చదువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే అతిథి అధ్యాపకురాలిగా పని చేస్తోంది. అన్నకు నాన్న ఉద్యోగం రావడంతో కొల్లూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చింది. ఎంతో కష్టపడి తమని చదివించిన నాన్న కోరిక ప్రకారం సివిల్స్ సాధించి ఉన్నతాధికారిగా సామాన్యులకు సేవ చేయడమే ఆయనకు తానిచ్చే నివాళిగా భావిస్తున్నానంటోంది తులసి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!