ఒంటరిగా దేశమంతా తిరిగింది...
దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలపై అందరికీ అవగాహన తేవాలనుకుంది ఆమె. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలపాలనుకుంది. దానికోసం ఏడాదిపాటు దేశమంతా ఒంటరిగా పర్యటించింది. అక్కడి కళలు, గృహనిర్మాణాలను ....
దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలపై అందరికీ అవగాహన తేవాలనుకుంది ఆమె. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలపాలనుకుంది. దానికోసం ఏడాదిపాటు దేశమంతా ఒంటరిగా పర్యటించింది. అక్కడి కళలు, గృహనిర్మాణాలను పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న పలురకాల అంశాలను సేకరించింది. వీటన్నింటినీ డాక్యుమెంటరీగా రూపొందించాలనుకుంటున్న 34ఏళ్ల కావ్య సక్సేనా యాత్రావిశేషాలివీ...
సమయం దొరికితే చాలు, సినిమా, బీచ్, షాపింగ్ లేదా విదేశం.. చాలా మంది ఎంపికలివే. అయితే రాజస్థాన్, జయపురకు చెందిన కావ్య సక్సేనా మాత్రం భిన్నంగా ఆలోచించింది. చెన్నై లయోలా కాలేజీలో పీజీడీఎం చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ట్రీ ఆఫ్ లైఫ్ రిసార్ట్స్ అండ్ హోటల్స్, కాన్వాస్ లాఫ్ క్లబ్ వంటి సంస్థల్లో ఉద్యోగం చేసింది. జీవితంలో ఒకసారైనా దేశమంతా తిరగాలని, గ్రామీణ సంప్రదాయాలను తెలుసుకోవాలని కలలు కనేది. ఇంట్లో, స్నేహితులతో చెప్పినప్పుడు గ్రామాల్లో ప్రయాణం సురక్షితం కాదని వారించేవారు. ఎందరెన్నిచెప్పినా కావ్య మాత్రం తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంది. ఉద్యోగరీత్యా దిల్లీలో గతేడాది లాక్డౌన్ తర్వాత కూడా ఇంటిపట్టునే ఉండటం నచ్చలేదు. ఆ సమయాన్ని తన లక్ష్యానికి వినియోగించాలనుకుంది. అంతే తన దగ్గర ఉన్న రూ.5 లక్షలతో యాత్రను ప్రారంభించింది.
హస్తకళలంటే ప్రాణం.. బాల్యం నుంచి హస్తకళలంటే ఇష్టమైన కావ్యకు గ్రామాల్లో వాటి ఉనికిని తెలుసుకోవాలనుకుంది. అలా గతేడాది సెప్టెంబరులో తన స్కార్పియో జీపులో పశ్చిమ్‌బంగ నుంచి ఒంటరిగానే దేశ యాత్రను మొదలుపెట్టింది. పర్వతశ్రేణుల ప్రాంతాల్లో, లోయల్లో, మారుమూల గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతిచోట ఆగుతూ, అక్కడివారి కళలను పరిశీలించానంటోంది కావ్య. ‘కొన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు, మరొకొన్ని చోట్ల హస్త కళలను చూసి ఆశ్చర్యపోయా. అక్కడి మహిళల సంప్రదాయాలు, సంస్కృతి అపురూపంగా అనిపించేవి. వారిలో దాగిఉన్న అద్భుత నైపుణ్యాలు నన్ను విభ్రాంతికి గురిచేశాయి. కటక్‌లో సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని జైరో లోయలో ప్రతి ఇంట్లో ఇంటీరియర్, అక్కడి మహిళలు వేసుకునే టాటూస్, ఒడిశాలోని కాట్పాడ్ గ్రామంలో గృహాలు, హస్తకళలు, నాగాలాండ్‌లో కోన్యాక్స్ గిరిజన్ల సంప్రదాయాలు మరవ లేనివి. ప్రతి గ్రామంలో స్థానిక నేతలు లేదా ప్రజలే నాకు బస సౌకర్యాన్నిచ్చేవారు. మారుమూల ప్రాంతాల్లో చిన్నచిన్న గుడిసెల్లోనే ఉండేదాన్ని. పల్లెప్రజలు నన్నెంతో ప్రేమగా ఆదరించారు. ఏడాదిలో మైళ్లదూరం పర్యటించా. మహారాష్ట్ర తప్ప మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగా. అలాగే జాతీయ రహదారుల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు చాలామంది నాకు సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చేవారు. ప్రతి చిన్న విశేషాన్ని, సమాచారాన్ని పొందుపరిచా. నేటి తరానికి తెలియని విశేషాలతో త్వరలో డాక్యుమెంటరీ చేసి, అందరికీ చేరేలా కృషి చేస్తా’ అంటున్న కావ్యకు మోటార్‌స్పోర్ట్స్‌లో అనుభవం ఉంది. 2015లో రాయల్ రాజస్థాన్ ర్యాలీలో విజేతగా నిలిచిన కావ్య నేటితరానికి ఆదర్శమే కదూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!