ఉంగరాల డిజైనింగ్‌తో సేవ!

సాధారణంగా ఎవరైనా పేరు ప్రఖ్యాతుల గురించే ఆలోచిస్తారు. కానీ మేఘన్‌ మార్కెల్‌, సెరెనా విలియమ్స్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖుల కోసం ఉంగరాలను రూపొందించే ఇరవై నాలుగేళ్ల శిల్పా యార్లగడ్డకి మాత్రం ‘నేను ఎదగాలి..

Published : 07 Oct 2021 02:09 IST

సాధారణంగా ఎవరైనా పేరు ప్రఖ్యాతుల గురించే ఆలోచిస్తారు. కానీ మేఘన్‌ మార్కెల్‌, సెరెనా విలియమ్స్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖుల కోసం ఉంగరాలను రూపొందించే ఇరవై నాలుగేళ్ల శిల్పా యార్లగడ్డకి మాత్రం ‘నేను ఎదగాలి... మరికొందరినీ ఎదగనివ్వాలి...’ అనేది ఆశయం. అందుకు తన ఆదాయంలో సగాన్ని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల కోసం ఉపయోగిస్తోంది. 

మధ్య టైం మ్యాగజైన్‌... అత్యంత ప్రభావవంతమైన వందమంది ప్రముఖులపై ఓ సంచికను విడుదల చేసింది. ఆ కవర్‌ మీద మేఘన్‌ మార్కెల్‌, ప్రిన్స్‌ హ్యారీల ఫొటో ఉంటుంది. అలాంటి ఫొటోలు కొత్తేమీ కాదు కానీ... అందులో మేఘన్‌ మార్కెల్‌ ఉంగరాన్ని డిజైన్‌ చేసింది శిల్పా యార్లగడ్డ. మేఘన్‌ మాత్రమే కాదు.. క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌, హాలీవుడ్‌ హీరోయిన్‌ ఎమ్మా వాట్సన్‌ వంటి ప్రముఖులెందరో శిల్ప ఉంగరాలను పెట్టుకున్న వారే. శిల్పది తెలుగు నేపథ్యమే అయినా... పుట్టి పెరిగింది సిలికాన్‌ వ్యాలీలో. హార్వర్డ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న ఆమె... నాసా, మైక్రోసాఫ్ట్‌ రిసెర్చ్‌ విభాగాల్లో ఇంటర్న్‌గానూ పని చేసింది. చిన్నప్పటినుంచీ పురుషులే ఎక్కువగా ఉన్న స్టార్టప్‌లు చూసిన తను మహిళలను ప్రోత్సహించేందుకు ఏదో ఒకటి చేయాలనుకుంది. అలా పుట్టిందే ‘షిఫాన్‌కో’. తనకు నగల డిజైనింగ్‌లో ప్రవేశం లేకపోయినా ఎంతో అధ్యయనం చేసింది. ఎన్నో ప్రయోగాలూ చేసింది. నాలుగేళ్ల క్రితం షిఫాన్‌కో పేరుతో ఉంగరాలు డిజైన్‌ చేసే సంస్థనూ, ‘స్టార్టప్‌ గాళ్‌ ఫౌండేషన్‌’నూ ప్రారంభించింది. ఇందుకు తను దాచుకున్న 5వేల డాలర్లూ, హైస్కూల్‌లో స్కాలర్‌షిప్‌గా వచ్చిన 20 వేల డాలర్లనూ పెట్టుబడిగా పెట్టింది. వైవిధ్యమైన ఉంగరాలను ప్రముఖులకు డిజైన్‌ చేస్తూ వచ్చే ఆదాయంలో యాభై శాతాన్ని స్టార్టప్‌ గాళ్‌ ఫౌండేషన్‌కు మళ్లిస్తోంది. ఇప్పటివరకూ పదకొండు స్టార్టప్‌లకు ఫండింగ్‌ అందించిందీ అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్