అప్పుడు జేఆర్‌డీ టాటా... ఇప్పుడు ఆరోహీ..

ఆమె వయసు పాతికేళ్లే. సాధించినవన్నీ ప్రపంచరికార్డులే. లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో వేల కిలోమీటర్లు ప్రయాణించి రెండు మహా సముద్రాలను ఒంటరిగా దాటేసింది. ఈనెల 15న మరో రికార్డుకు సన్నద్ధమవుతోంది ఆరోహీ పండిట్‌. ఆ సాహసమేంటో  తెలుసుకుందాం..  

Published : 14 Oct 2021 01:24 IST

ఆమె వయసు పాతికేళ్లే. సాధించినవన్నీ ప్రపంచరికార్డులే. లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో వేల కిలోమీటర్లు ప్రయాణించి రెండు మహా సముద్రాలను ఒంటరిగా దాటేసింది. ఈనెల 15న మరో రికార్డుకు సన్నద్ధమవుతోంది ఆరోహీ పండిట్‌. ఆ సాహసమేంటో  తెలుసుకుందాం..  

రిగ్గా 89 ఏళ్లక్రితం.. అంటే 1932, అక్టోబరు 15. ఆ రోజు టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ విమానంలో కరాచీ నుంచి ముంబయికి చేరుకుని అప్పట్లో వార్తల్లోకెక్కారు ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సివిల్‌ ఏవియేషన్‌’గా పేరొందిన జేఆర్‌డీ టాటా. ఆయన ప్రయాణించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ సింగిల్‌ ఇంజిన్‌తో తయారు కావడం ప్రత్యేకం. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కే కొన్ని మార్పులు చేసి.. సింగిల్‌ ఇంజిన్‌, సగం ఇంధనంతో ఈ నెల టాటా ప్రయాణించిన అదే అక్టోబరు15న ఆరోహీ గుజరాత్‌లోని భుజ్‌ రన్‌వే నుంచి బయలుదేరి.. జుహూ విమానాశ్రయంలో దిగనుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో శత్రువులను నిలువరించడానికి అత్యవసర పరిస్థితుల్లో గుజరాత్‌లోని మాధాపుర్‌ గ్రామ మహిళలు 72 గంటల్లో దీన్ని నిర్మించి చరిత్ర సృష్టించారు. ఆ మధ్య ఈ ఘటన గురించి భుజ్‌ అని బాలీవుడ్‌ చిత్రమూ వచ్చింది గుర్తుందా!


60 లీటర్లు మాత్రమే... సముద్రానికి అయిదువేల అడుగుల ఎత్తులో ఐదుగంటలపాటు, 500 నాటికల్‌ మైళ్లు ప్రయాణించనున్న ఆరోహీ విమానంలో కేవలం 60 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించనుంది. జీపీఎస్‌, కంప్యూటరైజ్డ్‌ ఎక్విప్‌మెంట్‌ వంటివి వాడకుండా, ఆటోపైలట్‌ లేకుండానే ఈ సాహసాన్ని పూర్తి చేయనుంది. ఈ సాహసాన్ని జేఆర్డీకి గౌరవంగా అందిస్తున్నట్లు భావిస్తున్నా అంటోంది ఆరోహీ. ‘దీన్ని జేఆర్డీ ట్రిబ్యూట్‌ ఫ్లైట్‌గా పిలుస్తారు. ఆయన ప్రయాణించిన విమానంలో నేనీ యాత్ర చేయడం గర్వంగా ఉంది. చరిత్రను తిరగరాసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది’ అంటోంది ఆరోహీ. ఈ కార్యక్రమాన్ని ఇండియన్‌ విమెన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తోంది.

కల సాకారం.. గుజరాత్‌కు చెందిన ఆరోహీకి క్రీడలు, పుస్తకపఠనం, గుర్రపుస్వారీ అభిరుచులు. గాలిలో ప్రయాణించాలని కలలు కనేది. అలాగే 17వ ఏట ముంబయి ఫ్లైయింగ్‌ కాలేజీలో చేరింది. లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మహిళా సాధికారత యాత్రకు తన 21వ ఏట ఎంపికైంది. ఆ తర్వాత లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాలను  దాటిన తొలి మహిళగా ప్రపంచరికార్డుని తన పేరిట లిఖించుకుంది. ప్రపంచంలోనే రెండో అత్యంత పొడవైన గ్రీన్‌ల్యాండ్‌ ఐస్‌షీట్‌ను దాటిన తొలి మహిళగానూ మరో ప్రపంచ రికార్డును ఇంకా పలు అవార్డులనూ దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్