క్యాన్సర్‌ కణాల్ని కనిపెట్టేస్తుంది...

క్యాన్సర్‌ కణాలని చికిత్స చేసి తొలగించినా... కొన్నిసార్లు అవి మళ్లీ పుట్టుకొస్తుంటాయి. ఆ సమస్య లేకుండా చేస్తోంది టెరాహెర్ట్జ్‌ సాంకేతిక పరిజ్ఞానం. దీని సాయంతో జ్యోతిర్మయి కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణ.. క్యాన్సర్‌ భాదితులకు వరంగా మారింది.

Updated : 22 Oct 2021 12:53 IST

క్యాన్సర్‌ కణాలని చికిత్స చేసి తొలగించినా... కొన్నిసార్లు అవి మళ్లీ పుట్టుకొస్తుంటాయి. ఆ సమస్య లేకుండా చేస్తోంది టెరాహెర్ట్జ్‌ సాంకేతిక పరిజ్ఞానం. దీని సాయంతో జ్యోతిర్మయి కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణ.. క్యాన్సర్‌ బాధితులకు వరంగా మారింది. ఈ ఒడిశా అమ్మాయి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

డిశాలో ఇంజినీరింగ్‌ చదివిన జ్యోతిర్మయి, చెన్నై గిండీ ఇంజినీరింగ్‌ కాలేజీలో మాస్టర్స్‌ చేసింది. సీఎస్‌ఐఆర్‌లో డాక్టరేట్‌ పూర్తిచేసింది. తర్వాత ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరింది. అందరికీ ఉపయోగపడేలా ఏదైనా ఆవిష్కరణ చేయాలని అనుకునేది జ్యోతిర్మయి. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పరికరాల అభివృద్ధి మాత్రం తక్కువగా ఉండటం గుర్తించింది. ఇప్పటికీ వైద్య పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడం గమనించి దేశంలోనే సంస్థను స్థాపించాలనుకుంది. ఇండియాలోనే తొలిసారిగా టెరాల్యూమెన్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థను 2019లో స్థాపించింది. అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక పరికరాలను రూపొందిస్తున్నందుకు తమిళనాడు ప్రభుత్వం ఆమెని అవార్డుతో గౌరవించి, సత్కరించింది. రొమ్ముక్యాన్సర్‌ వ్యాప్తి చెందిన కణజాలాన్ని మల్టీస్పెక్ట్రాల్‌ టెక్నాలజీతో పూర్తిగా గుర్తించగలిగే ఓ మెడికల్‌ డివైస్‌ని తను తయారుచేసింది. క్యాన్సర్‌ సోకిన కణజాలాన్ని సరిగా గుర్తించలేక ఏటా కోట్లమంది క్యాన్సర్‌ బాధితులకు రెండోసారి సర్జరీ చేయాల్సి వస్తోంది అంటోంది జ్యోతిర్మయి. ‘ఈ డివైస్‌ రోగి శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఎంతవరకూ వ్యాపించాయో అతి సూక్ష్మంగా కూడా గుర్తించగలదు. క్యాన్సర్‌ కణుతులకు శస్త్రచికిత్సలో ఇది చాలా ఉపయోగకరం. చికిత్స చేయాల్సిన ప్రాంతాన్ని గుర్తించడమే కాదు... రెండోసారి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే హిస్టోపాథాలజీ నివేదిక వచ్చే వరకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఇది త్వరితగతిన వ్యాధిని, దాని తీవ్రతను గుర్తిస్తుంది. వ్యాధి వ్యాపించని కణజాలాన్ని చూపించి, ఆ భాగాన్ని చికిత్స ద్వారా వృథాకాకుండా ముందుగానే గుర్తించి కాపాడుతుంది. దీంతో చికిత్సా సమయం కూడా తగ్గుతుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రీసెర్చి నివేదిక మేరకు 2018నాటికి మన దేశంలో 2.25 లక్షల మంది క్యాన్సర్‌కు గురవుతున్నారు. రొమ్ము, తల, మెడ తదితరప్రాంతాల్లో వచ్చే క్యాన్సర్‌కు జరుగుతున్న చికిత్సలలో 30 శాతం విఫలమవుతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్‌ కణాలు ఎంతవరకు వ్యాపించాయో కచ్చితంగా గుర్తించలేకపోవడమే. దీంతో రెండోసారి ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం వస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి టెరాహెర్ట్జ్‌సాంకేతికత వందశాతం ఉపయోగపడుతుంది. దీంతో ఏటా 1.2 లక్షలమందికి చేసే రెండోసారి చికిత్సను నివారించవచ్చు. ప్రస్తుతం క్లినికల్‌ టెస్ట్‌ పూర్తయింది. క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రులు, క్యాన్సర్‌ కేర్‌ను అందించే మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్‌,  క్యాన్సర్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్స్‌కు ఈ కొత్తపరికరాన్ని పరిచయం చేస్తున్నాం’ అంటోన్న జ్యోతిర్మయి రూపొందించిన ఈ డివైస్‌ పలు పోటీల్లో విజేతగానూ నిలిచింది. దీని తయారీలో ‘బయోటెక్నాలజీ ఇగ్నిషన్‌ గ్రాంట్‌ స్కీం- బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చి అసిస్టెన్స్‌ కౌన్సిల్‌’ నిధులు అందించగా, ఈ తరహా డివైస్‌ కోసం ప్రారంభించిన టెరాహెర్ట్జ్‌ పరిశోధనాశాల దేశంలోనే తొలి ల్యాబొరేటరీగా నిలవడం ప్రత్యేకం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్