గోండు అందం ఆమె కెమెరాలో!  

ఒకవైపు చదువుకుంటూ.. మరోవైపు తనకిష్టమైన ఫొటోగ్రఫీలో రాణిస్తోంది ఆత్రం మమత. ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటారా? ఆదివాసీ గోండుతెగలో ఈ స్థాయికి వచ్చిన అమ్మాయిలు చాలా అరుదు. అందుకే ఈ మమత ప్రత్యేకం.

Updated : 26 Oct 2021 05:49 IST

కవైపు చదువుకుంటూ.. మరోవైపు తనకిష్టమైన ఫొటోగ్రఫీలో రాణిస్తోంది ఆత్రం మమత. ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటారా? ఆదివాసీ గోండుతెగలో ఈ స్థాయికి వచ్చిన అమ్మాయిలు చాలా అరుదు. అందుకే ఈ మమత ప్రత్యేకం. ఆదివాసీ తెగలోని గోండులు, కొలాం గిరిజనుల అద్భుతమైన జీవనశైలిని చిత్రీకరిస్తూ అరుదైన, అందమైన చిత్రాలని అందిస్తోందీ అమ్మాయి. తండ్రి వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌ కావడంతో తనూ అదే బాట పట్టింది. కుమురంభీం జిల్లా సిర్పూరు మండల కేంద్రానికి చెందిన ఆత్రం విమల, మాధవ్‌రావులకు ముగ్గురూ ఆడపిల్లలే. వీరిలో పెద్దమ్మాయి పుష్పలత ఇంటర్‌ చదివి ల్యాబ్‌టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తోంది. రెండో అమ్మాయి ప్రేమలత ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మూడో కుమార్తె మమత మాత్రం వీరికి భిన్నంగా ఓ పక్క చదువుతూనే.. ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకుంది. జైనూర్‌ మండల కేంద్రంలో ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుంది. జైనూర్‌, సిర్పూరు మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూరు, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల పరిధిలోని గిరిజన గ్రామాలకు వెళ్లి వారి సంప్రదాయాలను కెమెరాతో అందంగా చిత్రీకరిస్తోంది. ఆదివాసీ గోండు తెగ నుంచి తొలి మహిళ ఫొటోగ్రాఫర్‌గానూ రాణిస్తోంది. 

 - బండారి లక్ష్మీనర్సయ్య, ఇంద్రవెల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్