రక్షణశాఖను మెప్పించింది
ప్రయాణానికి ముందే ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఇంజిన్‌ను క్షుణ్ణంగా పరిశీలించినా ఒక్కోసారి అనుకోకుండా లోపాలు తలెత్తుతాయి. గ్రహించేలోపే ప్రమాదం జరిగిపోతుంది. అలా కాకుండా వెంటనే కనిపెట్టే అవకాశముంటే..! దానిపైనే..
ప్రయాణానికి ముందే ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఇంజిన్‌ను క్షుణ్ణంగా పరిశీలించినా ఒక్కోసారి అనుకోకుండా లోపాలు తలెత్తుతాయి. గ్రహించేలోపే ప్రమాదం జరిగిపోతుంది. అలా కాకుండా వెంటనే కనిపెట్టే అవకాశముంటే..! దానిపైనే పరిశోధన చేశారు డాక్టర్ దగ్గుబాటి శిరీష. తన ఆవిష్కరణతో కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆత్మనిర్భర్ పురస్కారాన్నీ అందుకున్నారు...
రక్షణశాఖ ఆధ్వర్యంలో డీఆర్డీవో జాతీయ స్థాయిలో డేర్ టు డ్రీమ్ 2.ఓ-2020 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1965మంది యువ శాస్త్రవేత్తలు ఆలోచనలను పంపగా.. స్టార్టప్ విభాగంలో 15, వ్యక్తిగత విభాగంలో 20 మంది చొప్పున ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లా కేజీ కుప్పంకు చెందిన డాక్టర్ శిరీష ఒకరే ఎంపికయ్యారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, జేఎన్టీయూ, హైదరాబాద్ నుంచి ఎంఈ, కేఎల్‌యూ నుంచి పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. భర్త దగ్గుబాటి వంశీకృష్ణ స్కూల్ డైరెక్టర్. శిరీష ప్రొఫెసర్ కేఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో.. మరో ముగ్గురితో కలిసి బృందంగా ఎనిమిదేళ్లుగా రక్షణ సంబంధిత ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. తను రాసిన పలు పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్్్సలో ప్రచురితమయ్యాయి. డేర్ టూ డ్రీమ్ పోటీల్లో భాగంగా మూడు అంచెల వడపోత తర్వాత వ్యక్తిగత విభాగంలో శిరీష ఎంపికయ్యారు. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా అబ్దుల్‌కలాం ఆత్మనిర్భర్ పురస్కారం అందుకున్నారు. ‘రక్షణ శాఖలో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మానిటరింగ్‌పై పరిశోధన చాలా క్లిష్టం. పైగా ఖర్చుతో కూడుకున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఇంజిన్ లోపాలు తలెత్తుతుంటాయి. దీనిపై ఆధారపడే ఇతర భాగాల పనితీరు ఉంటుంది. మేము కనిపెట్టిన విధానంతో ఇంజిన్ పనితీరు, కండిషన్ పైలట్‌కు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుపై మరింత పరిశోధన చేయాలన్నది నా లక్ష్యం’ అంటున్నారు శిరీష.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!