పల్లె దాటకుండా... లక్షలు సంపాదిస్తోంది!
తను ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చూడాలన్నది నాన్న కోరిక. కానీ కూతురేమో పనికి రాని వాటితో అలంకరణ వస్తువులు చేస్తోంటే ఆయన విసుక్కునే వాడు. కానీ ఇప్పుడు తను ఇంట్లో కూర్చునే నెలకు
తను ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చూడాలన్నది నాన్న కోరిక. కానీ కూతురేమో పనికి రాని వాటితో అలంకరణ వస్తువులు చేస్తోంటే ఆయన విసుక్కునే వాడు. కానీ ఇప్పుడు తను ఇంట్లో కూర్చునే నెలకు లక్షకు పైగా సంపాదిస్తోంది. ఇంతకీ అర్పితా కటువాకి అదెలా సాధ్యమైందంటే..
అర్పితది ఒడిశాలోని టరగో అనే మారుమూల పల్లె. చాలా సాధారణ కుటుంబం. డిగ్రీతోపాటు సర్టిఫికెట్ ఆఫ్ టీచర్ ప్రోగ్రామ్ చేసింది... త్వరగా ఉద్యోగం వస్తుందని. ఆ కోర్సు చేసేటప్పుడు హాస్టల్లో ఉండేది. ఆ సమయంలో సరదాగా పనికిరాని పేపర్లు, వస్తువులతో గ్రీటింగ్ కార్డులు, అలంకరణ వస్తువులను చేసి స్నేహితులకు బహుమతులుగా ఇచ్చేది. అవి చూసిన చాలామంది మాకిమ్మని లేకపోతే కనీసం అమ్మమని అడిగే వాళ్లు. వీటిని అమ్మితే ఆదాయం వస్తుందని సోదరుడూ సలహా ఇచ్చాడు. మార్కెటింగ్‌లోనూ సాయం చేసేవాడు. అలా సంపాదనా మొదలైంది. అర్పితకు వాటిని యూట్యూబ్‌లో పెడితే బాగుంటుందనిపింది.. ‘క్రాఫ్ట్ గ్యాలరీ’ పేరిట వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో పెద్దగా స్పందన లేకున్నా నిరాశపడలేదు. పట్టుదలతో కొత్త అంశాలను నేర్చుకుని వీడియోలను ఆకర్షణీయంగా, ప్రయోజనకరంగా చేయడం మొదలుపెట్టింది. మొదట్లో నెలకు రూ.4 నుంచి 5 వేల వరకూ వచ్చేది. క్రమంగా ఆమెను అనుసరించే వారి సంఖ్య పెరిగి ఇప్పుడు నెలకు రూ.లక్షకుపైగా సంపాదిస్తోంది. ఒకప్పుడు ‘ఇదంతా పిచ్చిపని. ప్రభుత్వ ఉద్యోగం మీద దృష్టిపెడితే హాయిగా గడిపేయొచ్చు’ అని విసుక్కున్న నాన్న ఇప్పుడు పొంగిపోతున్నాడు. అరె ఆడపిల్ల ఎంత తెలివిగా చేస్తోంది అని ఊరి వాళ్లూ గర్వపడుతున్నారు. మా పిల్లలకూ నేర్పించు అని తన దగ్గరకు పంపుతున్నారు. ఆసక్తి, పట్టుదల ఉంటే రాణించడం సులువే అనడానికి అర్పిత ఉదాహరణలా లేదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!