వ్యాక్సిన్‌తో కోట్లు గెలిచింది
close
Updated : 14/11/2021 04:18 IST

వ్యాక్సిన్‌తో కోట్లు గెలిచింది

వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఒకమ్మాయికి రూ.7.4 కోట్లు వచ్చాయి. అదెలా అని ఆశ్చర్యపోకండి. లక్షల మందిలో అదృష్టలక్ష్మి ఆ అమ్మాయి తలుపే తట్టింది. ఆస్ట్రేలియాలో జరిగిందిది.

ప్రపంచవ్యాప్తంగా కరోనాను అరికట్టడానికి ప్రభుత్వాలన్నీ వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. ఉచితంగా ఇస్తోన్నా ఇప్పటికీ చాలామంది ఊహూ అంటున్నారు. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి. దీంతో అక్కడి ప్రభుత్వం కొన్ని ఆఫర్లను పెట్టింది. వాటిలో ‘ద మిలియన్‌ డాలర్‌ వాక్స్‌ క్యాంపెయిన్‌’ ఒకటి. దీన్లో వ్యాక్సిన్‌ వేయించుకున్న పేర్లు లాటరీ తీస్తారు. గెలిస్తే మిలియన్‌ డాలర్లు, అంటే మన రూపాయల్లో 7.4 కోట్లు బహుమతి. ఇటీవలే లాటరీ తీస్తే జోన్నె జూ విజేతగా నిలిచింది. ఈ సొమ్మును ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలూ కలిసి అందించాయట. ముప్పై లక్షల మందికిపైగా పాల్గొంటే అదృష్టం నన్ను వరించింది అని జోన్నె సంబరపడుతోంది. ఈ డబ్బుని నాన్న వ్యాపారానికీ, చైనాలో ఇరుక్కుపోయిన తన కుటుంబాన్ని సిడ్నీ తీసుకురావడానికీ, తన భవిష్యత్‌కీ ఖర్చు చేస్తుందట. లాటరీ విషయం చెబుదామని కాల్‌ చేసినా జోన్నె ఫోన్‌ ఎత్తలేదట. వాళ్లే తన చిరునామా కనుక్కొని వచ్చి మరీ చెక్‌ ఇచ్చారట. అదృష్టవంతుల్ని చెడగొట్టే వాళ్లు లేరు అంటే ఇదే కదా!


Advertisement

మరిన్ని