కుకీ లేడీగా ఎదగాలని...
ఉద్యోగాలు చేస్తున్నా... అభిరుచికే అగ్ర తాంబూలం అంటోంది నేటి యువత. దాన్నే వ్యాపార మంత్రంగా జపిస్తూ... రెండు చేతులా ఆదాయం అందుకుంటోంది. ఈ కోవకే చెందుతుంది ఇరవై ఆరేళ్ల హర్షిణి కాకర్ల. ‘హ్యాపీ కుకీస్’ పేరుతో బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు చేస్తోన్న ఆమె తన ప్రయాణాన్ని ఇలా చెప్పుకొచ్చింది.
ఉద్యోగాలు చేస్తున్నా... అభిరుచికే అగ్ర తాంబూలం అంటోంది నేటి యువత. దాన్నే వ్యాపార మంత్రంగా జపిస్తూ... రెండు చేతులా ఆదాయం అందుకుంటోంది. ఈ కోవకే చెందుతుంది ఇరవై ఆరేళ్ల హర్షిణి కాకర్ల. ‘హ్యాపీ కుకీస్’ పేరుతో బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు చేస్తోన్న ఆమె తన ప్రయాణాన్ని ఇలా చెప్పుకొచ్చింది.
వంట నాకు ప్యాషన్. చిన్నప్పటి నుంచీ అమ్మ స్వరూపారాణి వంటలు చూస్తూ పెరిగా. కాస్త ఖాళీ దొరికినా పాకనైపుణ్యాలు నేర్చుకునేదాన్ని. దీన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన మొదట్లో లేదు. మాంచెస్టర్‌లో ఎంఎస్ చేసేటప్పుడు ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశా. అక్కడ విదేశీ వంటకాల తయారీని గమనించా. దీనికితోడు ఫుడ్ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే నా స్నేహితుడు అర్భాజ్ సిద్ధిఖీతో కలిసి ‘హంగ్రీఫోర్క్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్బ్లాగింగ్ చేసేవాళ్లం. వివిధ దేశాలు, ప్రాంతాలు తిరిగి అక్కడి ఆహారాన్ని మా లెన్స్ల్లో బంధించే వాళ్లం. దీనికి క్రమంగా ఆదరణ పెరిగింది. ఇప్పుడు 32 వేలమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
మెప్పించడానికి కష్టపడ్డా!
ఇండియాకి తిరిగొచ్చాక... ఓ లైఫ్‌స్టైల్ సంస్థలో ఉద్యోగంలో చేరా. ఆన్లైన్లో కుకింగ్/ బేకింగ్ కోర్సు పూర్తిచేశా. ఖాళీ దొరికినప్పుడు సన్నిహితులకు కుకీలు, సేవరీలు చేసిచ్చేదాన్ని. అందరికీ నచ్చుతుండటంతో... యూకేలోని ఓ చెఫ్ సాయంతో మరికొన్ని ప్రయోగాలూ చేశా. దీన్ని వ్యాపారంగా వ్యాపారంగా మలచుకోమని సలహా ఇచ్చింది మా బావ గిరీష్, చెల్లి శ్రేయ. వాళ్లే నాకు మొదటి ఆర్డరిచ్చారు. అదే వ్యాపారంలో నా మొదటి అడుగు. తర్వాత ‘హ్యాపీ కుకీస్’ రిజిస్టర్ చేయించి ఇన్‌స్టాలో ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టా. నా కుకీలలో ఎటువంటి నిల్వకారకాలూ ఉపయోగించను. అదే నా వ్యాపారమంత్రమై ఖాతాదారులను ఆకట్టుకుంది. పుట్టినరోజులు, ఇతరత్రా వేడుకలకోసం ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. నా మొదటి పెట్టుబడి రూ.2650. తొలి ఆదాయం పదకొండువేలు. ఇప్పుడు ఏటా తొమ్మిది లక్షలకు పైగానే టర్నోవర్‌ని సాధిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక కిచెన్, ఐదుగురు సిబ్బందినీ ఏర్పాటు చేసుకున్నా. ప్రస్తుతం ఎనిమిది రకాల కుకీస్, పదిరకాల ఐస్‌క్రీమ్‌లు మెనూలో ఉన్నాయి. వాటిల్లో బ్రౌనీ కుకీ(బ్రూకీ), వైట్ చాక్లెట్ క్రాన్బెర్రీ, చాకోచిప్స్, ట్రిపుల్ చాక్లెట్, మిక్స్ నట్‌తో పాటు పఫ్స్ వంటి సేవరీస్ కూడా చేసిస్తా. ఆఫీసుకెళ్తూ, మరోపక్క వీటికీ సమయం కేటాయించుకోగలుగుతున్నా అంటే... అందుకు మామయ్య మలినేని సాంబశివరావు, నాన్న రాజేంద్రప్రసాద్, అమ్మ, పెద్దమ్మ విజయలక్ష్మిల ప్రోత్సాహం ఎంతో. పక్కా ప్రణాళిక, శ్రమపడే తత్వం, ఉంటే మహిళలు... అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
- చెమట వాసనా..!
ఆరోగ్యమస్తు
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
- ఆ సమయంలో సౌకర్యంగా ఉండాలంటే..!
- ప్రొటీన్ ఎక్కువ వద్దు..
- ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ చేద్దామా..!
అనుబంధం
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
- ఈ పాలు పిల్లలకు ఇస్తున్నారా... ఒక్క నిమిషం!
యూత్ కార్నర్
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
- రోజంతా నడిచి... కిలిమంజారోను అధిరోహించి..!
'స్వీట్' హోం
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
- తెలుపు దుస్తులే ఎందుకు?
- గులాల్ గోటా... రంగుల కళ!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!