అక్కడ ఆమే తొలి ఫిట్నెస్ ట్రైనర్...
కశ్మీరు వాతావరణం, అక్కడి పరిస్థితులు ఎలాంటివో తెలిసిందే. అటువంటి ప్రాంతంలో వేలమంది మహిళలకు ఆరోగ్యంపట్ల అవగాహన కలిగిస్తోందీమె. తను అనారోగ్యాల నుంచి కోలుకొని, తనలాంటి వారందరినీ సమస్యల
కశ్మీరు వాతావరణం, అక్కడి పరిస్థితులు ఎలాంటివో తెలిసిందే. అటువంటి ప్రాంతంలో వేలమంది మహిళలకు ఆరోగ్యంపట్ల అవగాహన కలిగిస్తోందీమె. తను అనారోగ్యాల నుంచి కోలుకొని, తనలాంటి వారందరినీ సమస్యల నుంచి బయటపడేలా శిక్షణనిస్తున్న ఆలియా ఫరూఖ్ ఆ లోయలో తొలి ఫిట్నెస్ ట్రైనర్‌గానూ నిలిచింది.
ఖన్యార్ ప్రాంతానికి చెందిన ఆలియాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా. గర్భం దాల్చినప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అధికబరువు, మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలనెదుర్కొంది. వీటి నుంచి బయటపడటానికి జిమ్‌లో చేరమని భర్త సలహా ఇచ్చాడు. ఆయన అలానే చెబుతాడ్లే, అయినా మహిళల శారీరక సమస్యల గురించి మగవాళ్లకేం తెలుస్తుంది అనుకుంది. ఓసారి దిల్లీలో ఓ జిమ్‌లో మహిళలు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోవడం చూసింది. అప్పుడే తన ఆలోచన మారింది.
కష్టతరమైనా... ‘మా వారు కశ్మీరులో జిమ్ నిర్వహించే వారు. నేను మాత్రం అక్కడ ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు. ఓసారి దిల్లీలో ఒక జిమ్ చూశా. చాలామంది మహిళలు వ్యాయామాలు చేసే వారు. దాంతో నాకూ చేరాలనిపించింది. అలా అక్కడే చేరా. మొదట్లో ఇదో పెద్ద సవాలుగా అనిపించింది. ఎన్నడూ వ్యాయామం చేయని నేను, జిమ్‌లో శిక్షణ తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఎలాగైనా బరువు తగ్గాలనే లక్ష్యంతో క్రమేపీ వ్యాయామ సమయాన్ని పెంచుకున్నా. ఎంత కష్టపడ్డానంటే నాలుగు నెలల్లో 28 కేజీలు తగ్గగలిగా. ఆ తర్వాత కశ్మీరుకు వచ్చేశా. 2012లో మావారి జిమ్ నడపలేని పరిస్థితులు ఎదురయ్యాయి. అప్పటికే వ్యాయామాలతో ఫిట్‌గా మారాను. దాని వల్ల ఎంత హాయిగా, ఆరోగ్యంగా ఉన్నానో నాకు తెలుసు. కానీ నా చుట్టూ చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉండేవారు. అందుకే ఆ జిమ్‌ను మహిళల కోసం నేనే నిర్వహిస్తే ఎలా ఉంటుందా అనిపించింది. కశ్మీరులో అప్పటివరకు మహిళా జిమ్ ఇన్స్ట్రక్టర్లు లేరు. నేనే ఎందుకు కాకూడదనిపించింది. దాంతో హైదరాబాద్ వెళ్లి జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా శిక్షణ తీసుకుని వచ్చా. అలా మహిళలకు శిక్షణ ప్రారంభించా. మొదట్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే వచ్చే వారు. క్రమంగా ఆ సంఖ్య పెరిగింది. ఈ తొమ్మిదేళ్లలో వేల మంది మహిళలు నా దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. కశ్మీరు లోయలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు నా జిమ్‌కు వస్తుంటారు. రక్తపోటు, కొలెస్ట్రాల్, సంతానలేమి వంటి సమస్యలతో ఇక్కడకు ఫిట్నెస్ కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. వ్యాయామం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అందరిలో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంటా. ఈ శిక్షణ తర్వాత దాన్ని రోజూ కొనసాగించాలని చెబుతుంటా. ఇలా శిక్షకురాలిగా పని చేస్తున్నందుకు ఎన్నో విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్నా. మహిళలకెందుకు జిమ్ అనే వారు. మావారు, అత్తింటి వారు నాకు కొండంత అండగా నిలిచారు. అదే నాకు ముందడుగు వేసే ధైర్యాన్ని ఇచ్చింది. కశ్మీరులోని జిల్లాలన్నింటిలో మహిళల కోసం ప్రత్యేక జిమ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నా’ అంటున్న ఆలియా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!