వృథా వస్త్రం... ఉపాధి అస్త్రం
టూర్లో భాగంగా ఒక పరిశ్రమకు వెళ్లింది శ్రీనిధి. అక్కడ పెద్ద కుప్పగా పోసిన వస్త్రాలను చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడే ఓ ఉపాయమూ తట్టింది. అదే ఓ వ్యాపార మార్గమూ అయ్యింది. అంతేనా.. రాష్ట్రస్థాయిలో ఇన్నొవేటర్ అవార్డునూ దక్కించుకుంది. డిగ్రీ కూడా పూర్తిచేయని అమ్మాయి ఆ స్థాయికి ఎలా ఎదిగింది? చదివేయండి.
టూర్లో భాగంగా ఒక పరిశ్రమకు వెళ్లింది శ్రీనిధి. అక్కడ పెద్ద కుప్పగా పోసిన వస్త్రాలను చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడే ఓ ఉపాయమూ తట్టింది. అదే ఓ వ్యాపార మార్గమూ అయ్యింది. అంతేనా.. రాష్ట్రస్థాయిలో ఇన్నొవేటర్ అవార్డునూ దక్కించుకుంది. డిగ్రీ కూడా పూర్తిచేయని అమ్మాయి ఆ స్థాయికి ఎలా ఎదిగింది? చదివేయండి.
శ్రీనిధి చదువులో పెద్దగా చురుకేం కాదు. తిరుచ్చికి చెందిన ఈమె కామర్స్‌లో డిగ్రీలో చేరింది. ఎలాగోలా గ్రాడ్యుయేషన్ చేస్తే చాలన్నది తన ఆలోచన. ఓసారి కాలేజీ టూర్లో భాగంగా‘భెల్’కు వెళ్లింది. అక్కడ వృథా వస్త్రాలన్నీ పెద్ద కుప్పగా వేసి ఉండటం చూసింది. అంతపెద్ద మొత్తంలో అలా చూడటం అదే మొదటిసారి. ఆశ్చర్యపోయింది. వీటితో ఏదైనా చేస్తే వృథాను అరికట్టడంతోపాటు పర్యావరణానికీ మేలవుతుంది కదా అనుకుంది. తనప్పుడు డిగ్రీ మొదటి ఏడాదే! రెండో ఏడాదిలో ఉండగానే (2017లో) ‘రీ-టైలర్స్’ ప్రారంభించింది. ఆ వృథా వస్త్రాలతో బ్యాగులు, తలగడ కవర్లు, కర్టెన్లు, పౌచెస్, క్విల్ట్స్, డోర్‌మ్యాట్స్ చేయడం మొదలుపెట్టింది. వాటిని తిరుచ్చిలోని వస్త్రదుకాణాలు, పెద్దపెద్ద షోరూంలకు తీసుకెళ్లి చూపించేది. వినియోగదారులకు నచ్చాయి. ఉత్పత్తులన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యేవి. ఆ తర్వాతి ఏడాది స్థానిక కాలేజీలో జరిగిన ‘స్టార్టప్ మేళా 2.0’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ కార్యక్రమం శ్రీనిధికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ‘వృథా వస్తువులతో గృహాలంకరణ’ అనే అంశం ఆ పోటీలో ఈమెను ప్రథమ స్థానంలో నిలబెట్టింది. ఈ గెలుపు తానెంచుకున్న కెరియర్లో ఓ మైలురాయి అంటుందీమె.
‘తిరుచ్చి సహా చెన్నైలోని హోటల్స్, రెస్టారెంట్స్‌కు ఇంటీరియర్ డిజైన్ చేసే అవకాశాలు వెల్లువలా వచ్చాయి. మా ఉత్పత్తులు యూరప్‌కూ ఎగుమతి అయ్యేవి. రీసైకిలింగ్కుగానూ ‘తమిళనాడు స్టూడెంట్ ఇన్నొవేటర్ అవార్డు’ దక్కింది. డిగ్రీ పూర్తయ్యాక సొంతంగా కూర్గ్, కర్ణాటకల్లో షాప్స్ ప్రారంభించా. ఈకామర్స్ వేదికల్లోనూ అమ్మకానికి ఉంచా. ముంబయికి చెందిన అప్‌సైకిల్ క్లాతింగ్ స్టోర్‌లోనూ మా ఉత్పత్తులుండేవి. ఆర్డర్లు పెరగడంతో తయారీనీ పెంచా. దాంతో వృథా వస్త్రం ఎక్కువ మొత్తంలో కావాల్సివచ్చేది. దీంతో దేశవ్యాప్తంగా హోల్‌సేల్ టెక్స్టైల్ షాప్స్ నుంచి తెప్పించడం మొదలుపెట్టా. తయారీకి ఫ్రీలాన్స్ టైలర్స్‌కు శిక్షణనందించా. అలా వందల మందికి ఉపాధి కల్పించగలుగుతున్నా. భవిష్యత్‌లో దీన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నా. తిరుచ్చి సిటీ కార్పొరేషన్ సహకారంతో తడి, పొడి చెత్తలను విడదీసే ప్రాజెక్టును ప్రారంభించనున్నా. ఈ పట్టణంలో పేరుకుపోతున్న చెత్త భవిష్యత్తులో పర్యావరణ కాలుష్యాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. అందుకే దీనిపై అందరిలో అవగాహన పెంచేదిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఆర్ట్ డిజైన్ కోర్సు పూర్తి చేయాలనేది నా లక్ష్యం. అలాగే వృథాపై అవగాహన కలిగించే దిశగా ఫ్యాషన్ షో చేయాలని ఉంది’ అంటోన్న శ్రీనిధికి సినిమా రంగంలోనూ తన డిజైన్ నైపుణ్యాలను, ప్రతిభను చాటాలని కోరిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!