గిన్నెలు ఖాళీ చేసి.. గిన్నిస్‌ రికార్డులు!

పై ఫొటోలోని అమ్మాయిని చూశారా? పేరు లేహ్‌ షట్‌కీవర్‌. వయసు 28. మెరుపు తీగలా సన్నగా ఉంది కదూ! కానీ తను తినడం ప్రారంభించిందంటే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అయిపోవాల్సిందే. ఈ వేగమే తను ఇరవైకిపైగా గిన్నిస్‌ రికార్డులు బద్ధలు కొట్టేలా చేసింది. ‘స్పీడ్‌ ఈటర్‌’ పేరు కట్టబెట్టింది.

Published : 29 Nov 2021 01:27 IST

పై ఫొటోలోని అమ్మాయిని చూశారా? పేరు లేహ్‌ షట్‌కీవర్‌. వయసు 28. మెరుపు తీగలా సన్నగా ఉంది కదూ! కానీ తను తినడం ప్రారంభించిందంటే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అయిపోవాల్సిందే. ఈ వేగమే తను ఇరవైకిపైగా గిన్నిస్‌ రికార్డులు బద్ధలు కొట్టేలా చేసింది. ‘స్పీడ్‌ ఈటర్‌’ పేరు కట్టబెట్టింది.

ఈ తిండి పోటీ కార్యక్రమం సోదరుడి   కారణంగా మొదలైందట. తర్వాత అదే ఊపులో వేగంగా తినడం మొదలుపెట్టింది. ఇలా చేసి రికార్డులు కూడా సాధించవచ్చని తెలిశాక ఇక వెనుదిరిగి చూడలేదు లేహ్‌. ప్రత్యేంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. గిన్నిస్‌ వారి దృష్టిలో పడింది.

మూడు నిమిషాల్లో 10 జామ్‌ డోనట్స్‌, ఆరు వేడివేడి రొట్టెలు లాగించేయడం.. లీటరు గ్రేవీని 1.49 నిమిషాల్లో గటగటా తాగేయడం.. ఎనిమిది టొమాటోలు, 12 పొడవైన సాసేజ్‌లు, 301 గ్రాముల స్ప్రింగ్‌ రోల్స్‌,  23 మినీ పికిల్స్‌, చేతులతో తాకకుండా 20 మార్ష్‌మెల్లోస్‌, 12 చాక్లెట్‌ ట్రఫ్లెస్‌లు.. వీటిలో ప్రతిదాన్ని నిమిషంలో తినేయడం.. తన రికార్డుల్లో కొన్ని. ‘లా బీస్ట్‌ అనే వ్యక్తి నాకు స్ఫూర్తి. అయితే ఇలా చేయడం అనుకున్నంత సులువేం కాదు. నేనో రికార్డుకి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పదార్థం గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇబ్బంది పడ్డా. ఇలాంటి పోటీల్లో సాధారణంగా మగవాళ్లే ఎక్కువగా ఉంటారు. నీకు అవసరమా? అని చాలామంది హేళన చేసినా నేను పట్టించుకోకుండా ముందుకెళ్లా’ అంటూ ఉత్సాహంగా చెబుతోంది లేహ్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్