ఫ్యాషన్‌తో సందేశం

ఇటీవలి బ్రిటిష్‌ ఫ్యాషన్‌ అవార్డుల కార్యక్రమంలో టెన్నిస్‌ క్రీడాదిగ్గజం మరియా షరపోవా రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. సెలబ్రిటీ.. నడవడంలో ఆశ్చర్యమేముంది అనుకోవద్దు. ఇక్కడ ప్రత్యేకత ఆమె నడక కాదు.. ధరించిన గౌను!

Updated : 11 Dec 2021 05:56 IST

ఇటీవలి బ్రిటిష్‌ ఫ్యాషన్‌ అవార్డుల కార్యక్రమంలో టెన్నిస్‌ క్రీడాదిగ్గజం మరియా షరపోవా రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. సెలబ్రిటీ.. నడవడంలో ఆశ్చర్యమేముంది అనుకోవద్దు. ఇక్కడ ప్రత్యేకత ఆమె నడక కాదు.. ధరించిన గౌను!

ఆటతోనే కాక ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ షరపోవాకి పేరు. ఈసారి ఫ్యాషన్‌కి సందేశాన్నీ జోడించి పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్‌ ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. ఫ్రెంచ్‌ మినరల్‌ వాటర్‌ సంస్థ ఎవియన్‌ సహకారంతో ప్రముఖ మహిళా దుస్తుల డిజైనర్‌ హెర్పెన్‌ వృథా ప్లాస్టిక్‌ సీసాలతో ఓ గౌనును రూపొందించింది. దాన్ని మరియా ఈ సందర్భంగా ధరించింది. దీనికోసం 72 శాతం ప్లాసిక్‌ సీసాలు, 28 శాతం సిల్కు ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించారు. వృథా సీసాలను పూరేకలుగా చేసి, వాటిని సిల్కు వస్త్రంపై కుట్టి, 3డీ ప్రింట్గా మార్చారు. ఓషన్‌ థీంతో తీర్చిదిద్దిన దీనికి ‘మిమిసిస్‌’ అని పేరుపెట్టారు. మరియా దీనిలో తళుక్కుమనడమే కాకుండా, ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంది. ఈ తరహా గౌను ఇదే మొదటిదట. దీనిపై హ్యాండ్‌వర్క్‌కు 800 గంటలు, మొత్తం తయారీకి ఏడాదికాలం పట్టింది. ప్రపంచానికి అతిపెద్ద సమస్య అవుతోన్న ప్లాస్టిక్‌ను ఫ్యాషన్‌ రంగంలో ఉపయోగించడంపై అవగాహన కల్పించేలా డిజైనర్‌ ఈ గౌను రూపొందించానంటోంది. మంచి ఆలోచనే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్