కత్రినా ఫిట్‌నెస్‌ రహస్యం...

మల్లీశ్వరిగా తెలుగువారికి పరిచయమైన కత్రినా ఫిట్‌నెస్‌తో ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ రహస్యాన్ని చెప్పుకొచ్చిందిలా...‘వర్కవుట్‌ నా దినచర్యలో భాగం. స్క్వాట్స్‌, క్రాస్‌-ఫిట్‌, ప్లాంక్స్‌ వంటివన్నీ చేస్తా.

Updated : 12 Dec 2021 04:23 IST

ల్లీశ్వరిగా తెలుగువారికి పరిచయమైన కత్రినా ఫిట్‌నెస్‌తో ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ రహస్యాన్ని చెప్పుకొచ్చిందిలా...‘వర్కవుట్‌ నా దినచర్యలో భాగం. స్క్వాట్స్‌, క్రాస్‌-ఫిట్‌, ప్లాంక్స్‌ వంటివన్నీ చేస్తా. హ్యాంగింగ్‌ కోర్‌ వ్యాయామాలు నా కండరాలను బలోపేతం చేసి సరైన శరీరాకృతినిస్తాయి. బేసిక్‌ బాడీవెయిట్‌ వ్యాయామాలతోపాటు యోగా కూడా చేస్తా. ఉదయం 4 గ్లాసుల గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తా. ఇంటి భోజనానికే ప్రాధాన్యం. డెయిరీ ఫ్రీ, గ్లూటెన్‌ ఫ్రీ ఆహారాన్ని ఎంచుకుంటా. పాలకు బదులు సోయా, బాదం, స్కిమ్డ్‌ మిల్క్‌ తీసుకుంటా. భోజనంలో ఆవిరిపై ఉడికించే చేప, పప్పుదినుసులు, క్వినోవా పాన్‌కేక్స్‌, గుమ్మడి నూడుల్స్‌తోపాటు తాజా కూరగాయలు, గుడ్లు, ఉడికించిన చిలగడదుంపలకు ప్రాధాన్యమిస్తా. రిఫైన్డ్‌ షుగర్‌, నూనె పదార్థాలు, మసాలా వంటకాలు, బ్రెడ్‌, పాస్తాలకు దూరముంటా. సాయంత్రం బాదంపాలు, అవకాడో వేసి చేసే బెర్రీ స్మూతీ తీసుకుంటా. రాత్రి వీగన్‌ చీజ్‌తో కలిపి చేసిన మాంసం, చిలగడ దుంప తింటా. స్వీట్లపై ఆసక్తి ఉండదు కానీ ఇంట్లో చేసే వేరుశనగ ఉండలను మాత్రం వదలను. జలుబు, దగ్గు వంటి వాటిని దూరం చేసుకోవడానికి వంటింటి పదార్థాలు పసుపు, మిరియాలపొడి, తేనె, శొంఠిపొడి, దాల్చినచెక్కలనే ఉపయోగిస్తా’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్