చదువే ఆయుధంగా పోరాడుతోంది
నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. పేదరికం, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి వాటితో ఇక్కడ ఆడపిల్లలకు అక్షరాస్యత అందని ద్రాక్షలా ఉందంటూ పలు సర్వేలూ పేర్కొన్నాయి. ఈ విషయమే 19 ఏళ్ల సాదియా రియాజ్ షాయిఖ్ను తీవ్రంగా ఆలోచింపచేసింది.
నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. పేదరికం, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి వాటితో ఇక్కడ ఆడపిల్లలకు అక్షరాస్యత అందని ద్రాక్షలా ఉందంటూ పలు సర్వేలూ పేర్కొన్నాయి. ఈ విషయమే 19 ఏళ్ల సాదియా రియాజ్ షాయిఖ్ను తీవ్రంగా ఆలోచింపచేసింది. పేదపిల్లలకు అక్షరాస్యతపై అవగాహన కలిగించడానికి కృషి ప్రారంభించింది. వారిని విద్యవైపు అడుగులేసేలా చేస్తున్న సేవకు గాను పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న సాదియా స్ఫూర్తి కథనమిది.
దర్భంగా జిల్లా, డియోరా బాంధౌలి గ్రామానికి చెందిన సంపన్న కుటుంబంలో సాదియా రియాజ్ పుట్టింది. ముంబయిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గతేడాది కొవిడ్ సమయంలో తన సొంతగ్రామంలోని పిల్లల పరిస్థితి చూసి చలించి పోయింది. పేదరికంతో డ్రాప్‌అవుట్స్ పెరగడం, బాల్య వివాహాలతో ఆడపిల్లలు త్వరగా తల్లులు కావడం, ఆ తర్వాత తీవ్ర అనారోగ్యాల బారిన పడటం చూసింది. చదువుకు దూరమైన వారికి తిరిగి అక్షరాలను దగ్గర చేయాలనుకుంది. 2020లో ‘ది కమ్యూనిటీ లైబ్రరీ’ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘మౌలానా అజాద్ లైబ్రరీ’ పేరుతో పిల్లల కోసం ప్రత్యేక గ్రంథాలయాన్ని ప్రారంభించింది. దీనిద్వారా ఒకటి నుంచి 12వ తరగతి వరకు పేద పిల్లలకు పుస్తకాలను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. బిహార్‌లోని స్కూల్ బోర్డ్స్, ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలతోపాటు నోట్‌బుక్స్, కథలు, కామిక్స్, స్టెషనరీ కిట్స్ వంటివన్నీ పిల్లలకు ఏర్పాటు చేస్తోంది. అలాగే విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఇంటర్, డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కావాల్సిన వాటినీ అందిస్తోంది. వీటితోపాటు దిన పత్రికలన్నింటినీ ఉంచుతున్నాం అంటోంది సాదియా. ‘పిల్లలెవరైనా ఇక్కడ ఉచితంగా చదువుకొని, తమ నాలెడ్జిని పెంచుకోవచ్చు. చరిత్ర, సాహిత్యం, సైన్స్ వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయి. చదువుతోపాటు వారిలో పుస్తకపఠనంపై ఆసక్తిని పెంచడం కోసమే ఈ ఏర్పాటు. డిగ్రీ విద్యార్థులకూ ఇక్కడ పుస్తకాలుంటాయి. కళాశాలలో అడ్మిషన్స్, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కలిగించడానికి వర్క్‌షాపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. మహిళలకు, విద్యార్థులకు వారి హక్కులపై అవగాహన కలిగిస్తున్నా. మా లైబ్రరీని ప్రస్తుతం రోజుకి 200 మంది వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగించనున్నా. త్వరలో బెగుసరై లఖ్మినియా గ్రామంలో కూడా మరొక లైబ్రరీని తెరవనున్నా. మా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయాలను తెరిచి, వాటిద్వారా పిల్లల్లో చదువుకోవాలనే ఆసక్తిని పెంచాలనుకుంటున్నా.’అంటోంది సాదియా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!