ఆన్‌లైన్‌లో నేర్చుకున్నా!

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే తన అభిరుచికి పదును పెట్టుకుని ఇప్పుడు విదేశాల ఆర్డర్లూ అందుకుంటోంది మేగాజి సౌజన్య. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించిన ఈ నిజామాబాద్‌ అమ్మాయి స్ఫూర్తి కథనమిదీ...మాది కామారెడ్డి జిల్లా రాజంపేట. నాన్న మధు నిజామాబాద్‌ వచ్చి కులవృత్తి చేసేవారు. అమ్మ సునీత. అమ్మా నాన్నలకు నేను, తమ్ముడు విరాట్‌ సంతానం....

Published : 01 Jan 2022 02:03 IST

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే తన అభిరుచికి పదును పెట్టుకుని ఇప్పుడు విదేశాల ఆర్డర్లూ అందుకుంటోంది మేగాజి సౌజన్య. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించిన ఈ నిజామాబాద్‌ అమ్మాయి స్ఫూర్తి కథనమిదీ...

మాది కామారెడ్డి జిల్లా రాజంపేట. నాన్న మధు నిజామాబాద్‌ వచ్చి కులవృత్తి చేసేవారు. అమ్మ సునీత. అమ్మా నాన్నలకు నేను, తమ్ముడు విరాట్‌ సంతానం. నేను ఆరోతరగతిలో ఉండగా నాన్న గుండెపోటుతో చనిపోయారు. అమ్మ కొన్నాళ్లు కోలుకోలేదు. దీంతో మా బాబాయి వాళ్ల ఇంట్లోనే ఉన్నాం. తర్వాత మా పోషణ బాధ్యత అమ్మే తీసుకుంది. ఆమెకు కుట్లు, అల్లికలపై పట్టుంది. నా కోసం కొత్త డిజైన్లతో దుస్తులు కుట్టేది. వాటిని అందరూ మెచ్చుకునేవారు. అమ్మ కుట్టిందంటే చాలామంది వాళ్లకీ కుట్టమని ఆర్డర్లు ఇచ్చేవారు. దాంతో నాకూ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలనిపించింది. డిగ్రీ మూడో సంవత్సరం చదివేటప్పుడే ఆన్‌లైన్‌ కోర్సుల కోసం వెతికేదాన్ని. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్యాషన్‌ వాళ్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోన్న ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాను.

ఆరేళ్లు టీచర్‌గా..  2012లో ఇంటర్నెట్‌ ఇప్పుడున్నంత వేగంగా ఉండేది కాదు. స్తోమతకు మించిందైనా బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌ పెట్టించుకుని పాఠాలు వినేదాన్ని. అమ్మకు సాయపడటానికి డిగ్రీ తర్వాత ఆరేళ్లు టీచర్‌గా పని చేశాను. రాత్రుళ్లు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటూ ఏడాది కోర్సు పూర్తి చేశా. అమ్మ కూడా సాయం అందించేది. 2019లో నిర్మల్‌కు చెందిన తాటికొండ శిరీష్‌తో నా వివాహమైంది.   హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నా ఆలోచనను మావారు ప్రోత్సహించారు. కానీ ఆర్డర్లు ఎలా? హైదరాబాద్‌లో నేనెవరికి తెలుసు? నేను డిజైన్‌ చేసిన డ్రస్సులు ఎవరు తీసుకుంటారని అనుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌ నన్ను ఆదుకుంది. అక్కడ నా డిజైన్లు, వివరాలు ఉంచడంతో ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ తర్వాత క్షణం తీరిక లేకుండా మారిపోయా. సహాయకులను పెట్టుకుని ఇంటి వద్దే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులు రూపొందిస్తున్నా. తెలిసిన వారు ఆస్త్రేలియా, అమెరికాల్లో స్థిరపడ్డారు. వారు ఆర్డర్లు ఇవ్వడంతో చేసి పంపాను. వారి ద్వారా అక్కడ స్థిరపడిన వారి నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, యూఎస్‌ఏకు చెందిన విదేశీయులూ సంప్రదిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువగా ఆర్డర్లు ్లవస్తున్నాయి. జోర్‌దార్‌ సుజాత, శరణ్య, సిరి వంటి బుల్లితెర నటులకు డిజైన్‌ చేయడం ప్రారంభించాను.  మరి కొందరికీ ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.  

- కాసం సంజీవ్‌దేవ్‌, కామారెడ్డి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్