close
Updated : 02/01/2022 06:51 IST

పురాణాలతో రికార్డులు!

లాక్‌డౌన్‌ సమయాన్ని తనలోని కళాకారిణికి మెరుగులు దిద్దుకోవడానికి కేటాయించింది జ్యోత్స్న. ఈమెది తిరుపతి. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివింది. పెయింటింగ్‌పై చిన్నప్పటి నుంచి ఆసక్తి. యూట్యూబ్‌లో స్టెన్సిల్‌ ఆర్ట్‌ వీడియోలు తనని ఆకర్షించాయి. అంటే వేయదలచుకున్న చిత్రాలను నలుపు, తెలుపుల్లో అచ్చు వేసుకుంటారు. వాటిలో కొన్ని భాగాలు కత్తిరించి దాన్ని మరో కాగితం మీద పెట్టి రంగులు స్ప్రే చేస్తారు. ఇలా స్టెన్సిల్‌ చిత్రం తయారవుతుంది. ఈ కళ మీద నెలల తరబడి సాధన చేసింది. పట్టు సాధించింది. తను సృజించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేది. తనకో ప్రత్యేకత ఉండాలని శ్రీరామ పట్టాభిషేకంతోపాటు భారతంలోని మాయాజూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కృష్ణార్జునుల కురుక్షేత్ర ప్రవేశం, అంపశయ్యపై భీష్ముడు, శ్రీకృష్ణుడి విశ్వరూపం వంటి ఘట్టాలనూ చిత్రీకరించింది. అవే ఇండియా, ఆసియా బుక్‌ రికార్డులను తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచి తమ చిత్రాలూ గీసిపెట్టమని అడగడం మొదలుపెట్టారు. ఇలా చదువుకుంటూనే సంపాదిస్తున్నానని గర్వంగా చెబుతోందీ అమ్మాయి.


Advertisement

మరిన్ని