గోరింటాకుతో గిన్నిస్ రికార్డు....
అరచేతిపై గోరింటాకును తీర్చిదిద్దుకోవాలంటే కనీసం పది నిమిషాలపైనే పడుతుంది. కేరళకు చెందిన 25 ఏళ్ల ఆదిత్యా నితిన్ మాత్రం గంటలో 910 మందికి గోరింటాకు పెట్టి మరీ గిన్నిస్ రికార్డును అధిగమించింది.
అరచేతిపై గోరింటాకును తీర్చిదిద్దుకోవాలంటే కనీసం పది నిమిషాలపైనే పడుతుంది. కేరళకు చెందిన 25 ఏళ్ల ఆదిత్యా నితిన్ మాత్రం గంటలో 910 మందికి గోరింటాకు పెట్టి మరీ గిన్నిస్ రికార్డును అధిగమించింది.
ఆదిత్యకు చిన్నప్పటి నుంచి గోరింటాకు అంటే మహా ఇష్టం. తను పెట్టుకుని మురిసి పోవడమే కాదు, ఎదుటి వారి చేతులను మెహందీతో పండించడమంటే మరీ ఇష్టం. కోళీకోడ్ కాదలుండి ప్రాంతానికి చెందిన తనకు డిగ్రీ అవ్వగానే నితిన్‌తో పెళ్లైంది. తన ఆసక్తిని గమనించి అతనూ ప్రోత్సహించాడు. ఇంకేముంది... తన అభిరుచి మీద కృషి ప్రారంభించింది. మరో విశేషమేమంటే తనెవరిదగ్గరా శిక్షణ తీసుకోలేదు. దీని కోసం గంటల తరబడి సాధన చేసేది. తనకు పట్టుచిక్కిందని నమ్మకం కలిగాక జిల్లా, రాష్ట్ర స్థాయి మెహందీ పోటీలకు హాజరై విజేతగా నిలిచింది. గిన్నిస్‌లో గోరింటాకు డిజైన్లకు సంబంధించిన రికార్డును దాటాలనుకుంది. పాత రికార్డులను అధ్యయనం చేసింది. వాటిని అధిగమించడం కోసం కఠోరంగా సాధన చేసింది. ఈ జనవరి ఒకటిన అక్కడి సీఎమ్హెచ్ఎస్ మైదానంలో ఉదయం 9 నుంచి 10 గంటల్లోపు 910 మంది చేతులకు మెహందీ డిజైన్లను వేసి రికార్డు సృష్టించింది. గతంలో లండన్‌కు చెందిన సామినా హుస్సేన్ గంటలో 600 మందికి మెహందీ డిజైన్లు వేసిన రికార్డుని కేవలం 37 నిమిషాల్లోనే దాటేసింది. ‘నేను మైదానానికి చేరుకునేసరికి అక్కడి జనాన్ని చూసి కంగారుపడ్డా. ధైర్యం తెచ్చుకుని న్యాయనిర్ణేతలు, కెమెరాలెదుట నా ప్రయత్నాన్ని ప్రారంభించా. ఇదే కాదు... గతేడాది 12 నిమిషాల్లో ఏడు ప్రపంచ వింతలను గోరింటాకుతో ఒకే చేతిపై వేసి ఆసియన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా’ అని సంతోషంగా చెబుతున్న ఆదిత్య కట్టిపడేసే పెయింటింగ్స్ కూడా వేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!