ఆమె బలానికి రికార్డులు దాసోహం

అమ్మాయిలంటే సుకుమారం అంటారు! ఈమెని చూస్తే మాత్రం ఆ మాట అనలేరు. తను చేసేవన్నీ అత్యంత కష్టమైనవే మరి! అవే ప్రపంచ రికార్డులనూ తెచ్చిపెట్టాయి. ఆమె విశేషాలు చదివేయండి.

Updated : 16 Sep 2022 14:51 IST

అమ్మాయిలంటే సుకుమారం అంటారు! ఈమెని చూస్తే మాత్రం ఆ మాట అనలేరు. తను చేసేవన్నీ అత్యంత కష్టమైనవే మరి! అవే ప్రపంచ రికార్డులనూ తెచ్చిపెట్టాయి. ఆమె విశేషాలు చదివేయండి.

టీవల గిన్నిస్‌ రికార్డ్స్‌ సంస్థ ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక అమ్మాయి 12,216 కిలోలున్న డబుల్‌ డెకర్‌ బస్‌ను లాగుతున్న వీడియోను ఉంచింది. లాగిందేమో రెండు జడలతో! మహిళల్లో ఇంత బరువును లాగిన వారు లేరు. దీంతో ప్రపంచ రికార్డునూ సొంతం చేసుకుంది. ఇటలీలోని మిలాన్‌లో జరిగింది ఇది. ఇది చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోయి తన గురించి వెదుకులాట మొదలుపెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయెవరంటే... మన పంజాబ్‌కు చెందిన ఆశారాణి. ఆమె పేరిట ఇంకా ఏడు గిన్నిస్‌ రికార్డులున్నాయి. గతంలో కనురెప్పలతో 15.15 కిలోలు ఎత్తింది. చెవులతో 1700 కిలోల వ్యాన్‌ను, పళ్లతో 22.16 సెకన్లలో 25 మీ. లాగిన రికార్డు వంటివి ఈమె ఖాతాలో ఉన్నాయి. అతి బలమైన అమ్మాయే.. కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్