30 కోట్ల మంది అభిమానులు

కైలీ జెన్నర్‌ సంచలనాన్ని సృష్టించింది. ఇంతకీ ఏంటా సంచలనం అనుకుంటున్నారా? ఇన్‌స్టా వేదికగా ఆమెను అనుసరించే అభిమానుల సంఖ్య 30 కోట్లకు చేరుకుంది...

Published : 14 Jan 2022 01:14 IST

కైలీ జెన్నర్‌ సంచలనాన్ని సృష్టించింది. ఇంతకీ ఏంటా సంచలనం అనుకుంటున్నారా? ఇన్‌స్టా వేదికగా ఆమెను అనుసరించే అభిమానుల సంఖ్య 30 కోట్లకు చేరుకుంది...

ఎవరీమె: అమెరికాలో ప్రముఖ మోడల్‌, టెలివిజన్‌ నటి, వ్యాపారవేత్త.

సాధించిన ఘనత: ప్రపంచంలో ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న తొలి మహిళ తనే. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తర్వాత స్థానంలో కైలీ ఉంది. రొనాల్డోకు 38.8కోట్లు మంది ఫాలోయర్లు ఉన్నారు.  

వారిని దాటి: మహిళల్లో ఇప్పటివరకు అత్యధిక అభిమానులున్న(28.9కోట్లు)ఘనత పాప్‌ గాయనులు అరియానా గ్రాండే, సెలెనా గోమెజ్‌లది. వారిని అధిగమించి కైలీ ఈ రికార్డు దక్కించుకుంది.

ఇంకా... కైలీ యుక్తవయసులోనే ఫ్యాషన్‌ రంగంలో తారాపథానికి దూసుకువెళ్లింది. సౌందర్యోత్పత్తుల వ్యాపారం, టీవీ ప్రొడక్షన్‌, యాప్స్‌ రంగాల్లోనూ ప్రవేశించింది. ర్యాపర్‌ ట్రావిస్‌ స్కాట్‌తో జీవితాన్ని పంచుకుంది. వీరికి ఓ పాప. ప్రస్తుతం కైలీ రెండోసారి గర్భం దాల్చింది. తనవీ, కుమార్తెవి, కుటుంబంతో దిగిన ఫొటోలు, వ్యక్తిగత విషయాల వీడియోలను కూడా ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్