మోమోలతో కోట్ల వ్యాపారం

నేపాల్‌, టిబెట్‌ సంప్రదాయ వంటకమైన  మోమోలు.. భారత ఈశాన్య రాష్ట్ర ప్రజల వంటకాల్లోనూ భాగమయ్యాయి. ఈ మధ్య ఇవి దేశవ్యాప్తంగా లభిస్తున్నాయి. అయితే, మోమోలు తయారు చేయడం అంత సులభం కాదు. అందుకే, సరసమైన ధరలకే ఎక్కువకాలం నిల్వ చేసుకునేలా ఫ్రోజెన్‌ మోమోలను తయారు చేసి విక్రయిస్తున్నారు దిల్లీకి చెందిన అదితి మదన్‌. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆమె మోమో మామీగా పేరు సంపాదించుకున్నారు. ఓ సాధారణ ఉద్యోగి నుంచి

Published : 20 Jan 2022 00:52 IST

నేపాల్‌, టిబెట్‌ సంప్రదాయ వంటకమైన  మోమోలు.. భారత ఈశాన్య రాష్ట్ర ప్రజల వంటకాల్లోనూ భాగమయ్యాయి. ఈ మధ్య ఇవి దేశవ్యాప్తంగా లభిస్తున్నాయి. అయితే, మోమోలు తయారు చేయడం అంత సులభం కాదు. అందుకే, సరసమైన ధరలకే ఎక్కువకాలం నిల్వ చేసుకునేలా ఫ్రోజెన్‌ మోమోలను తయారు చేసి విక్రయిస్తున్నారు దిల్లీకి చెందిన అదితి మదన్‌. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆమె మోమో మామీగా పేరు సంపాదించుకున్నారు. ఓ సాధారణ ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా ఆమె ఎదిగిన తీరు మహిళాలోకానికి ఆదర్శం.

శ్చిమబంగలోని డార్జిలింగ్‌కు చెందిన అదితి మదన్‌ వివాహమైన తర్వాత దేశ రాజధాని దిల్లీకి మకాం మార్చారు. అయితే, ఆమె ఎంతో ఇష్టంగా తినే మోమోలు దిల్లీలో లభించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో దొరికినా నాణ్యత లేకపోవడం ఆమెను నిరాశకు గురిచేశాయి. దీంతో అసలైన హిమాలయన్‌ మోమోల రుచిని తనే దిల్లీ ప్రజలకు చూపించాలనుకున్నారు. వాటిని ప్రజలు రెగ్యులర్‌గా తయారు చేసుకోలేరు కాబట్టి.. నిల్వ చేసుకోవడానికి వీలుగా ఫ్రోజెన్‌ మోమోలు తయారు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు విస్తృతంగా అధ్యయనం చేసి ప్రిజర్వేటివ్స్‌ వాడకుండా కనీసం ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా మోమోలను తయారు చేశారు.

బ్లూపైన్‌ ఫుడ్స్‌ స్థాపన..

అదితి.. మరో ఇద్దరితో కలిసి 2016లో ‘బ్లూపైన్‌ ఫుడ్స్‌’ పేరుతో స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. ‘యాంకీజ్‌’ బ్రాండ్‌తో ఫ్రోజెన్‌ మోమోలు తయారు చేసి ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించడం మొదలుపెట్టారు. మొదట ఈ ప్రాజెక్టును జయపురలో ప్రారంభించి పరిశీలించారు. అక్కడ విజయవంతం కావడంతో వ్యాపారాన్ని దిల్లీకి విస్తరించారు. ఇప్పుడు మోమో, స్ప్రింగ్‌ రోల్స్‌ను తయారు చేస్తూ దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ‘‘మేం స్థానికంగా లభించే పదార్థాలు, వనరులతో మొదట నాలుగు రకాల మోమోలను తయారు చేశాం. ఇప్పుడు ప్రతిరోజు 35 రకాలకుపైగా భిన్నమైన మోమోలను తయారు చేస్తున్నాం. ’’అని అదితి తెలిపారు.

‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా’ ఇచ్చిన ధైర్యం..

2013లో ‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా సీజన్‌ 3’లో టాప్‌ 6 అభ్యర్థిగా నిలిచిన అదితి.. అక్కడి అనుభవాలే తనకు వ్యాపారం ప్రారంభించడానికి  ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పారు. ‘ప్రజల ఆహారం.. వారి భావోద్వేగాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో తనకు  ఆ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.

రూ. 5లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ‘బ్లూ పైన్‌ ఫుడ్స్‌’ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 3.5 కోట్లకు చేరింది. ఇటీవల ఆమె స్థాపించిన సంస్థ.. షార్క్‌ ట్యాంక్‌ అనే స్టార్టప్‌ పోటీల్లో విజేతగా నిలిచి రూ. 75 లక్షలు గెలుపొందడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్