ప్రపంచాన్ని చుట్టేస్తూ...!

ప్రపంచం మొత్తం చుట్టేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ దానిని నిజం చేసుకునేది చాలా తక్కువమంది. అమెరికాకు చెందిన 21 ఏళ్ల లెక్సీఆల్‌ఫోర్డ్‌ 196 దేశాలు చుట్టేసి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గిన్నిస్‌ రికార్డు కొట్టేసింది..

Updated : 25 Jan 2022 05:05 IST

భ్రమణ ఆకాంక్ష

ప్రపంచం మొత్తం చుట్టేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ దానిని నిజం చేసుకునేది చాలా తక్కువమంది. అమెరికాకు చెందిన 21 ఏళ్ల లెక్సీఆల్‌ఫోర్డ్‌ 196 దేశాలు చుట్టేసి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గిన్నిస్‌ రికార్డు కొట్టేసింది..

లెక్సీ ఆల్‌ఫోర్డ్‌ కాలిఫోర్నియాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులకు ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ఉంది. దీంతో చిన్నతనం నుంచీ ప్రయాణాలపై ఇష్టం పెంచుకుంది. మెుదట్లో కుటుంబ సభ్యులతో కలిసి వివిధ దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించేది. 12 ఏళ్లు వచ్చేసరికి తనే సొంతగా ప్రయాణాలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు దాచుకుంటూ దీన్నో అలవాటుగా మార్చుకుంది. చదువులో చురుగ్గా ఉంటూ.. 18 ఏళ్లకే డిగ్రీ పట్టా అందుకుంది. అప్పటికే 72కుపైగా దేశాలు చుట్టేసింది. మిగతా దేశాలూ చుట్టేసి ప్రపంచ రికార్డు బద్ధ్దలుకొట్టాలనుకుంది. 2019లో ఉత్తరకొరియా పర్యటన పూర్తి చేసుకుని.. 196 దేశాలు చుట్టేసిన పిన్న వయస్కురాలిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకెక్కింది. ఆల్‌ఫోర్డ్‌.. ప్రయాణం కంటే ముందు ఆ ప్రాంతం గురించి లోతుగా తెలుసుకుంటుంది. ఏ విమాన సంస్థలు తక్కువధరకే టికెట్లు ఇస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు వంటివి ఏమైనా ఉన్నాయా? ఆ ప్రాంతంలో తక్కువధరలో వసతి దొరుకుతుందా వంటివి పక్కాగా ప్రణాళిక వేసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టా పేజీ లెక్సీ లిమిట్‌లెస్‌లో తన ప్రయాణ వివరాలు పెడుతుంది. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తోంది. ఇటీవలే రిపబ్లిక్‌ ఆఫ్‌ కోసోవోలో అడుగుపెట్టి 197 దేశాలు చుట్టేసిన ఘనత సాధించింది. ‘ప్రపంచం ఊహించుకున్నంత భయంకరమేమీ కాదు. ఆయా ప్రాంతాల్లో చట్టాలు, రాజకీయాలు వేరుగా ఉండొచ్చు గానీ.. అన్ని సంస్కృతి, సంప్రదాయాల సారంశం ఒకటే అంటోంది’ ఈ యువ ట్రావెలర్‌ లెక్సీ ఆల్‌ఫోర్డ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్