ఫిట్‌నెస్‌తో.. కోటి గెల్చింది

ఆరోగ్యం, ఇంకా డబ్బులు గెలిచే అవకాశం! ఓ సంస్థ పెట్టిన పోటీ సారాంశమిది. శారీరక ఇబ్బందులతో బాధపడుతోన్న ధ్యాన్‌ సుమన్‌ను ఇది ఆకర్షించింది. దీంతో ప్రయత్నించింది. అంతేనా రూ. కోటి గెల్చుకుంది. పూర్తి వివరాలు కావాలా.. చదివేయండి.

Updated : 26 Jan 2022 05:39 IST

ఆరోగ్యం, ఇంకా డబ్బులు గెలిచే అవకాశం! ఓ సంస్థ పెట్టిన పోటీ సారాంశమిది. శారీరక ఇబ్బందులతో బాధపడుతోన్న ధ్యాన్‌ సుమన్‌ను ఇది ఆకర్షించింది. దీంతో ప్రయత్నించింది. అంతేనా రూ. కోటి గెల్చుకుంది. పూర్తి వివరాలు కావాలా.. చదివేయండి.

ధ్యాన్‌ సుమన్‌ది జయపుర. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, ఐఐటీ- బాంబే నుంచి డిజైనింగ్‌లో డిగ్రీ, పీజీ పట్టాలను అందుకుంది. న్యూట్రిషన్‌ సైన్స్‌లో సర్టిఫికేషన్‌నూ చేసింది. దిల్లీలో శామ్‌సంగ్‌లో చీఫ్‌ డిజైనర్‌గా చేస్తోంది. ఈమెకు చిన్నప్పటి నుంచీ ఆస్తమా ఉండేది. బైక్‌లు నడపడం, దూరప్రాంతాలకు బైక్‌పై ప్రయాణించడం అంటే సరదా. ఓసారి అలా ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. చేయి విరిగింది. ఆ సమయంలో కొంచెం లావైంది. ఈమెకు ఫిట్‌నెస్‌పైనా ఆసక్తి ఎక్కువ. ఈ సమయంలోనే ఫిట్టర్‌ అనే దేశీయ సంస్థ నిర్వహిస్తోన్న ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ గురించి తెలుసుకుంది. ఈ ఆన్‌లైన్‌ పోటీలను ఏటా నిర్వహిస్తారు. 12 వారాలపాటు సాగుతుంది. 18 ఏళ్లు నిండిన వారెవరైనా పాల్గొనే వీలున్న ఈ పోటీల్లో ఫిట్‌నెస్‌ పరంగా స్పష్టమైన మార్పు కనబరిచినవారికి బహుమతులుంటాయి. సుమన్‌ గత నాలుగేళ్లుగా వీటిల్లో పాల్గొంటోంది. గత ఏడాది టాప్‌ మూడో ర్యాంకు వరకూ చేరుకున్న ఈమె ఈ ఏడాది విజయం సాధించి , రూ. కోటి గెలుచుకుంది. లింగం, వయసుల వారీగా ఒంటరిగా, జంటగా లేదా కుటుంబంతో కలిసి దీనిలో పాల్గొనవచ్చు. ప్రతివారం వాళ్లు అనుసరించిన విధానాలతోపాటు, శరీరంలో చోటు చేసుకున్న మార్పులను వీడియో రూపంలో సంస్థతో పంచుకోవాల్సి ఉంటుంది. క్రమంగా వారు సాధించిన మార్పు ఆధారంగా దశలవారీ వడపోతలయ్యాక విజేతల్ని ప్రకటిస్తారు. దీనిలో వర్కవుట్లతోపాటు సులువైన, తేలికగా జీర్ణమయ్యే డైట్‌ను ఎంచుకొంది సుమన్‌. ‘ఓ వైపు ఆస్తమా. కొవిడ్‌ కారణంగా సమస్య మరింత ఇబ్బంది అయ్యింది. దీనికితోడు చేయి విరగ్గొట్టుకున్నా.. ఇది నన్ను నేను ఆరోగ్యంగా మార్చుకోవడానికి సాయపడటమే కాకుండా విజేతనూ చేసింద’ని సంతోషంగా చెబుతోంది సుమన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్