Published : 07/02/2022 00:12 IST

విద్యుత్‌ లేకుండా... నెలరోజులు నిల్వ!

కాయగూరలు, పండ్లు వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేం. అందుకే చిరువ్యాపారులు, రైతులు అవి పాడవ్వకముందే ఎంతోకొంతకి అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తారు. ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపించాలనుకుంది బిహార్‌కి చెందిన రష్మీఝా. బయోటెక్నాలజీ విద్యార్థిని అయిన రష్మీ వాళ్లన్నయ్య నిక్కీఝాతో కలిసి ‘సబ్జీకోథి’ అనే పరికరాన్ని కనిపెట్టింది. చూడ్డానికి కాయగూరల బండి చుట్టూ అమర్చుకునే తెరలా ఉంటుందీ పరికరం. దీనిలో కాయగూరల్ని నెలరోజులపాటు నిల్వ చేసుకోవచ్చు. ఇందుకోసం అయ్యే ఖర్చు చాలా తక్కువ. లీటర్‌ నీళ్లు, మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ చేసుకునేందుకు అవసరం అయిన విద్యుత్‌ మాత్రమే అవసరం అవుతాయి. అవి తప్ప మరే రసాయనాలు కానీ, కరెంట్‌ ఖర్చు కానీ ఉండదు. తక్కువ ఖర్చుతో 1000 కిలోల కాయగూరల్ని.. నెలరోజుల వరకూ నిల్వచేసే ఈ పరికరం అందరి ప్రశంసలతో పాటు పెట్టుబడులూ అందుకుంది. తాజాగా అంకురాలని ప్రోత్సహించే ‘షార్క్‌టాంక్‌ ఇండియా’షోలోనూ మెరిసింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని