‘శ్రీవల్లి’ పాట ఎమ్మా నోట

‘పుష్ప’లో ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ పాటని ఇంగ్లిష్‌లో పాడుతున్న ఓ విదేశీ గాయని వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఇంతకీ తనెవరంటే నెదర్లాండ్స్‌కు చెందిన ఎమ్మా హీస్టర్స్‌. ఆ పాటను తనే ఆంగ్లంలోకి తర్జుమా

Updated : 12 Feb 2022 17:25 IST

‘పుష్ప’లో ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ పాటని ఇంగ్లిష్‌లో పాడుతున్న ఓ విదేశీ గాయని వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఇంతకీ తనెవరంటే నెదర్లాండ్స్‌కు చెందిన ఎమ్మా హీస్టర్స్‌. ఆ పాటను తనే ఆంగ్లంలోకి తర్జుమా చేసి, తనదైన శైలిలో పాడి శ్రోతల్ని అలరిస్తోంది. పల్లవి ఇంగ్లిష్‌లో ఉంటే, చరణాన్ని మాత్రం ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి... మాటే మాణిక్యమాయెనే’ అంటూ తెలుగులోనే పాడ్డం మరో విశేషం. ఎమ్మా గానం చాలా బాగుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా మెచ్చుకున్నాడు కూడా. ఇప్పటికే ఆ పాటని యూట్యూబ్‌లో 30 లక్షల మంది విన్నారు. తను మనకు కొత్త కానీ చాలా బాలీవుడ్‌ పాటల్ని ఆంగ్లంలోకి అనువదించి, పాడి వహ్వ అనిపించుకుంది. యూట్యూబులో 50 లక్షలు, ఇన్‌స్టాలో 10 లక్షల మందికి పైగా ఎమ్మాను అనుసరిస్తున్నారు. గానంతో పాటు ఈ అమ్మాయికి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి... నటి, గీత రచయిత, మోడల్‌ కూడా. ప్రతిభకు సృజనాత్మకతను తోడు చేసుకుని భాషల హద్దులు చెరిపేసి... అంతర్జాతీయంగా మెప్పిస్తోందీ 26 ఏళ్ల అమ్మాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్