అంతర్జాతీయ సంగీతంలో మన ‘శ్రేయ’?

బ్లాక్‌స్వాన్‌... కొరియాకు చెందిన ఈ అంతర్జాతీయ పాప్‌ బ్యాండ్‌ గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. అయిదుగురు సభ్యుల ఈ బ్యాండ్‌ నుంచి ఒకమ్మాయి తప్పుకుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక్క మెట్టు దూరంలో ఉంది భారతీయ యువతి శ్రేయా లెంక. డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడటం, ఫిట్‌గా ఉండటం... వేటిలో ఒకట్రెండు నైపుణ్యాలు నేటితరం అమ్మాయిల్లో కనిపిస్తాయి. కానీ ఈ మూడింటిలోనూ ప్రతిభను సంపాదించడమే కాకుండా వాటిని సమ్మిళతం

Published : 17 Feb 2022 00:27 IST

బ్లాక్‌స్వాన్‌... కొరియాకు చెందిన ఈ అంతర్జాతీయ పాప్‌ బ్యాండ్‌ గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. అయిదుగురు సభ్యుల ఈ బ్యాండ్‌ నుంచి ఒకమ్మాయి తప్పుకుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక్క మెట్టు దూరంలో ఉంది భారతీయ యువతి శ్రేయా లెంక.

డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడటం, ఫిట్‌గా ఉండటం... వేటిలో ఒకట్రెండు నైపుణ్యాలు నేటితరం అమ్మాయిల్లో కనిపిస్తాయి. కానీ ఈ మూడింటిలోనూ ప్రతిభను సంపాదించడమే కాకుండా వాటిని సమ్మిళతం చేసి ప్రదర్శనలు ఇస్తోంది ఒడిశాకు చెందిన శ్రేయా లెంక. ఈ ప్రత్యేకతలే ఆమెని ‘బ్లాక్‌స్వాన్‌’ పోటీలో నిలిచేలా చేశాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ అమ్మాయిల బ్యాండ్‌కు పాప్‌ సంగీతంలో దశాబ్దాల చరిత్ర ఉంది. వీరి ఆల్బమ్‌లకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులున్నారు. దీన్లో విదేశీయులకూ సభ్యత్వం ఇస్తారు. వీరి ఆల్బమ్‌లు వీక్షకుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ఖాళీ అయిన ఒక్క స్థానం కోసం వివిధ దేశాలకు చెందిన నాలుగు వేల మంది పోటీపడ్డారు. శ్రేయా, బ్రెజిల్‌ అమ్మాయి గ్యాబ్రియెలా చివర దశ పోటీలకు అర్హత సాధించి దక్షిణ కొరియా చేరుకున్నారు. నెల రోజుల  శిక్షణ అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతగా ప్రకటిస్తారు.

ఇన్ని విద్యలు ఎలా సాధ్యమంటే...

రవుర్కెలాకు చెందిన 18 ఏళ్ల శ్రేయా తల్లిదండ్రులు యోగా శిక్షకులు. దాంతో చిన్నప్పట్నుంచే యోగా తన జీవితంలో భాగమైంది. ఈ సాధన వల్లే... శరీరాన్ని విల్లులా వంచే సామర్థ్యం సొంతం చేసుకుంది. కలలపై ఆసక్తి పెంచుకున్న శ్రేయా.. ఒడిస్సీ నృత్యం నేర్చుకోంది. తన పట్టుదల, ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో స్థానికంగా పలు నృత్య ప్రదర్శనల్నిస్తూ అవార్డుల్నీ అందుకుంది. తర్వాత పలు ఆధునిక నృత్యరీతుల్ని సైతం ఔపోసన పట్టిన శ్రేయా హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది. అక్కడితో ఆగిపోకుండా పాశ్చాత్య సంగీతాన్నీ నేర్చుకుంది. కొన్ని కొరియన్‌ పాప్‌ పాటలకు సైతం కవర్‌ సాంగ్స్‌ చేసిన శ్రేయ... వాటిని సోషల్‌ మీడియా వేదికల్లో పోస్ట్‌ చేస్తోంది. వాటిని చూసినవాళ్లంతా శ్రేయా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. తన బహుముఖ ప్రజ్ఞతో ప్రపంచ వేదికపై పోటీపడుతోన్న ఈ అమ్మాయి.. అక్కడ గెలిస్తే, కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌లో చేరబోయే తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్