శెభాష్.. షబానా!
షబానా షేక్‌కు అప్పుడు నాలుగేళ్లు. చంకలో ఏడాది తమ్ముడు. ముంబయి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారెవరో. దారి తెలియక చూస్తున్న వాళ్లిద్దరినీ ఓ అనాథాశ్రమం వాళ్లు చేరదీశారు. మొదట్లో భయం భయంగా ముడుచుకుపోయే ఆ అమ్మాయి..
షబానా షేక్‌కు అప్పుడు నాలుగేళ్లు. చంకలో ఏడాది తమ్ముడు. ముంబయి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారెవరో. దారి తెలియక చూస్తున్న వాళ్లిద్దరినీ ఓ అనాథాశ్రమం వాళ్లు చేరదీశారు. మొదట్లో భయం భయంగా ముడుచుకుపోయే ఆ అమ్మాయి.. నెమ్మదిగా తనని తాను మార్చుకుంది. ఇప్పుడు వైద్య విద్యలో చేరబోతోంది. అతికష్టమైన పరీక్షల్లో నీట్ కూడా ఒకటి. దానిలో శిక్షణ లేకుండానే అర్హత సాధించింది. ‘అమ్మానాన్న, బంధువులెవరో నాకు గుర్తులేదు. మమ్మల్ని వదిలేసిన వాళ్లని తెలుసుకోవాలన్న కోరికా లేదు. మొదట్లో భయపడేదాన్ని. గతాన్ని తలచుకుని బాధ పడటం కంటే భవిష్యత్ కోసం పోరాడాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. తలరాతను మార్చుకోవడం నా చేతిలోనే ఉందనీ అర్థమైంది. అందుకే కష్టపడి చదివేదాన్ని. డాక్టర్ అవ్వాలన్నది నా కల. అనాథాశ్రమం యాజమాన్యమూ ప్రోత్సహించారు. అవసరమైన మెటీరియల్‌ను సంపాదించుకుని ఆశ్రమంలోనే సాధన మొదలుపెట్టా. రెండేళ్ల క్రితమూ రాశా. అర్హత సాధించినా ఫలితం తృప్తినివ్వలేదు. మళ్లీ ప్రణాళిక వేసుకుని చదివి, రాశా. రోజుకు 8-10 గంటలు చదివేదాన్ని. మంచి కళాశాలలో సీటునూ సాధించా. నా కల దిశగా మొదటి అడుగు వేశా. నన్ను చూసి అనాథాశ్రమం సభ్యులతోపాటు తోటి పిల్లలూ గర్వపడుతున్నారు’ అంటోంది షబానా.
తనకు సంగీతమన్నా ఇష్టమే. కానీ వైద్యవృత్తికే తొలి ప్రాధాన్యమంటోంది. గైనకాలజిస్ట్ అవ్వాలనుందట. ఇప్పుడు తనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అన్నీ ఉన్నా చిన్న వైఫల్యానికే కుంగిపోయే వారే ఎక్కువ. కానీ ఈ అమ్మాయి పరిస్థితులకు తల వంచాలనుకోలేదు. తన కలల్ని సాధించడానికి పోరాడుతోంది. చిన్న చిన్న వాటికే భయపడి వెనకడుగేసే వాళ్లందరికీ షబానా స్ఫూర్తే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!