ఈ నేల మాది!

ల్యుదిమెలా ప్లవిచెంకొ...క్రేనియన్లు మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచం ఆమెని యుద్ధభూమిలో మృత్యుదేవతగా అభివర్ణిస్తుంది. ‘లేడీ డెత్‌’ అని ఇష్టంగా పిలుచుకునే ఈమె ఉక్రెయిన్‌ సైనికురాలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా తరఫున పోరాడి 309మంది జర్మన్‌ నాజీ సైనికులని మట్టుబెట్టింది.

Updated : 02 Mar 2022 12:46 IST

ల్యుదిమెలా ప్లవిచెంకొ... ఉక్రేనియన్లు మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచం ఆమెని యుద్ధభూమిలో మృత్యుదేవతగా అభివర్ణిస్తుంది. ‘లేడీ డెత్‌’ అని ఇష్టంగా పిలుచుకునే ఈమె ఉక్రెయిన్‌ సైనికురాలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా తరఫున పోరాడి 309మంది జర్మన్‌ నాజీ సైనికులని మట్టుబెట్టింది. 33 ఏళ్ల నాదియా సెవిచెంకోనికి ‘ఉక్రెయిన్‌ హీరో’ అని బిరుదునిచ్చింది అక్కడి ప్రభుత్వం. 2014లో రష్యా దాడిని తిప్పికొట్టి ఇద్దరు జర్నలిస్టులని మట్టుబెట్టింది నాదియా. రష్యా ప్రభుత్వానికి దొరికిపోయి, పాతికేళ్ల జైలు శిక్షని అనుభవిస్తోంది. ప్లవిచెంకో, నాదియాలు ఉక్రెయిన్‌ మహిళలకు అందించిన వారసత్వం సాధారణమైనదేం కాదు. దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనకాడకూడదనే భావం బలంగా నాటుకున్న ఉక్రెయిన్‌ మహిళలు తాజా యుద్ధంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. 1993 నుంచే ఉక్రెయిన్‌ ప్రభుత్వం మహిళలని సైన్యంలోకి ఆహ్వానించి.. మగవాళ్లతో సమాన హక్కులు కల్పించింది. అందుకే మొత్తం ఆర్మీలో 15 శాతం అంటే సుమారుగా రెండులక్షలమంది సైన్యంలో ఉన్నారు. గత డిసెంబర్‌లో ఫిట్‌ ఫర్‌ మిలిటరీ సర్వీస్‌ పేరుతో 20 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు విధుల్లో చేరొచ్చు అనడంతో జర్నలిస్టులు, బ్యాంకు ఉద్యోగినులు పోరాటానికి సిద్ధమయ్యారు. అందుక్కావాల్సిన శిక్షణ కూడా తీసుకున్నారు. యుద్ధంలో ప్రత్యక్షంగా పోరాడలేని అరవై ఏళ్లు పైబడిన బామ్మలూ బబుష్కా బెటాలియన్‌ పేరుతో బృందంగా ఏర్పడి.. సైనికులకు కావాల్సిన సాయం అందిస్తారు. అంటే వారికి కావాల్సిన యూనిఫాంలు కుట్టడం, ఆహారాన్ని అందించడం వంటివన్న మాట. ఈ క్రమంలోనే మాతృభూమిని కాపాడుకునేందుకు ప్రముఖ మోడల్‌, మాజీ మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ విజేత అనస్టాసియాలెన్నాతో సహా ఎంతోమంది ప్రముఖులూ ఆయుధాలు చేతపట్టి రణరంగంలో దిగుతున్నారు. మా నేల కోసం చావడానికైనా సిద్ధమే అంటునారీ ధీర వనితలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్