వినువీధుల్ని దాటి... చంద్రునిపై ప్రదర్శన!

ప్రియాంకదాస్‌ రాజ్‌కాకాటి మంచి చిత్రకారిణి.. అయితే ఆమె వేసిన చిత్రాలని చూడాలనుకుంటే మీరు చంద్రుడిపైకి వెళ్లాలి! ఆశ్చర్యపోకండి. ఇంటర్నేషనల్‌ మూన్‌ గ్యాలరీ ప్రాజెక్టు పేరుతో ఈ ఏడాది జాబిల్లిపై ఓ

Published : 03 Mar 2022 01:32 IST

ప్రియాంకదాస్‌ రాజ్‌కాకాటి మంచి చిత్రకారిణి.. అయితే ఆమె వేసిన చిత్రాలని చూడాలనుకుంటే మీరు చంద్రుడిపైకి వెళ్లాలి! ఆశ్చర్యపోకండి. ఇంటర్నేషనల్‌ మూన్‌ గ్యాలరీ ప్రాజెక్టు పేరుతో ఈ ఏడాది జాబిల్లిపై ఓ చిత్రప్రదర్శన జరుగుతోంది. ఇందుకోసం లూనార్‌ లాండర్‌ మిషన్‌ అనే వ్యోమనౌకని భూమ్మీద నుంచి పంపిస్తున్నారు. అందులో మన దేశం నుంచి ‘భేదదీపిక’ పేరుతో ఒక చిత్రం ప్రదర్శితమవుతోంది. అసోంకు చెందిన శాస్త్రవేత్త, ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ ప్రియాంకదాస్‌ ఈ చిత్రాన్ని గీసింది. సైంటిస్ట్‌ ఏంటి?... చిత్రాలు ఏంటి అంటారా? ఆర్ట్‌ అంటే ప్రాణం పెట్టే ప్రియాంక అందులోనే కెరియర్‌ని వెతుక్కుందామని ఎన్‌ఐడీ(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైనింగ్‌)లో చేరింది. కానీ తనకి సైన్స్‌ అన్నా ఇష్టమే. ‘రెండింట్లో ఏది అనుకున్నప్పుడు సైన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాను. వయసు పెరిగే కొద్దీ ఆర్ట్‌లో పరిణతి చూపించవచ్చు. కానీ సైన్స్‌ తర్వాత చదువుదాం అంటే అవ్వదు కదా!’ అనే ప్రియాంక ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉపగ్రహాలు అందించే సంకేతాలను డీకోడ్‌ చేయడంపై పీహెచ్‌డీ చేస్తోంది. ‘ఉపగ్రహాల సంకేతాలు నేను వదులుకున్న చిత్రలేఖనాన్ని మళ్లీమళ్లీ గుర్తుచేసేవి. అలాంటి సమయంలోనే మూన్‌గ్యాలరీ ప్రాజెక్ట్‌ గురించి తెలిసింది. అయితే చందమామపైకి ఏం పంపాలన్నా చాలా ఖర్చవుతుంది. ఒక కిలో బరువుని పంపాలంటే మిలియన్‌ యూరోలని వెచ్చించాలి. అందుకే మనం వేయాలనుకున్న చిత్రాన్ని సెంటీమీటర్‌ పరిమాణం ఉండే క్యూబ్‌లో కుదిస్తారు. అదంత తేలిక కాదు... అందుకే నాకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని ఈ భేద]దీపికని చిత్రీకరించాను.’ అనే ప్రియాంక ఈ ప్రత్యేకత సాధించినందుకు ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30లోనూ చోటు సంపాదించుకుంది. 25 ఏళ్లప్పుడు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై ఆ వయసులో మళ్లీ నడక నేర్చుకుని చదువుల బాటపట్టిన ప్రియాంక మన సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించచ్చు అంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్