ఆ సీన్‌కి కట్‌ చెప్పేది ఆమే!

నాయికా... నాయకుల ఏకాంత సన్నివేశం. పూలు, పళ్లు.. చూపించి ఈ సీన్‌ని కానిచ్చేసే వారు పాతరోజుల్లో. కానీ.. ఆధునిక సినిమా కథలు స్త్రీ, పురుష లైంగిక విషయాలను, భావోద్వేగాలను లోతుగా చర్చిస్తున్నాయి. దాంతో ఏకాంత సన్నివేశాలనీ తెరపై చూపించాల్సి వస్తోంది.

Published : 08 Mar 2022 00:26 IST

కొత్త కొత్త రంగాల్లో కూడా మహిళలు సత్తా చాటుతున్నారు. అలాంటి ఓ రంగమే ఇది...

నాయికా... నాయకుల ఏకాంత సన్నివేశం. పూలు, పళ్లు.. చూపించి ఈ సీన్‌ని కానిచ్చేసే వారు పాతరోజుల్లో. కానీ.. ఆధునిక సినిమా కథలు స్త్రీ, పురుష లైంగిక విషయాలను, భావోద్వేగాలను లోతుగా చర్చిస్తున్నాయి. దాంతో ఏకాంత సన్నివేశాలనీ తెరపై చూపించాల్సి వస్తోంది. ఇలాంటివి చిత్రీకరించేటప్పుడు మహిళా నటులకు ఇబ్బంది కలగదా? మగవాళ్లు చొరవ తీసుకుంటే? ‘అలా తీసుకోవడానికి ఆస్కారం లేకుండా నియంత్రించడమే మా పని’ అంటోంది మనదేశపు మొదటి ‘ఇంటిమసీ డైరెక్టర్‌’ ఆస్థాఖన్నా. దీపికా పదుకోన్‌ నటించిన ‘గెహరాయియా’ చిత్రానికి ఇంటిమసీ డైరెక్టర్‌గా పనిచేసిందీమె. అంధాదున్‌, శ్రీరామ్‌రాఘవన్‌తో పాటు మరికొన్ని బాలీవుడ్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆస్థా ఎదుర్కొన్న సమస్య... ఏకాంత దృశ్యాలని మహిళలకు ఇబ్బంది కాకుండా ఎలా చిత్రీకరించాలి? అని. ‘మీటూ ఉద్యమ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తారలు.. నటించే సమయంలో పడ్డ ఇబ్బందులని బయటకు వచ్చి చెప్పారు. అప్పుడు ఏర్పాటు చేసిన సంస్థే లండన్‌లోని ఇంటిమసీ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌. అమందా బ్లూమెంథల్‌ దీనిని స్థాపించింది. దీనిలో కోర్సు పూర్తిచేసి మన దేశపు తొలి సర్టిఫైడ్‌ ఇంటిమసీ డైరెక్టర్‌ని అయ్యా. దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని.. దానిని నటులకు వివరించి, వర్క్‌షాపులు నిర్వహిస్తాం. దానివల్ల సన్నివేశాల్లో పొరపాట్లు, అతిచొరవని నియంత్రించగలుగుతాం. మా దగ్గర కొన్ని కిట్లు కూడా ఉంటాయి. వాటి సాయంతో మహిళలకు ఇబ్బంది కలిగించకుండా... కథతో రాజీపడకుండా చిత్రీకరించేందుకు కావాల్సిన చిట్కాలు చెబుతుంటాం’ అంటోంది విభిన్నమైన వృత్తిలో రాణిస్తున్న ఆస్థా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్