క్యాన్సర్‌ రాదనుకోవడం... ఓ అపోహ!

‘నేను ఏ రోజూ వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయను... ఖరీదైన పోషకాహారాన్ని తీసుకుంటాను. హాయిగా నిద్రపోతాను... కాబట్టి నాకు క్యాన్సర్‌ రాదు’ ఇలా అనుకొంటే అది ఒక అపోహే అంటోంది జీరోధా సంస్థ కో ఫౌండర్‌ సీమాపాటిల్‌. గత నవంబరులో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డ సీమా చికిత్స తీసుకుంటూనే తోటి మహిళల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు కొన్ని విషయాలు పంచుకున్నారు....

Published : 11 Mar 2022 00:55 IST

‘నేను ఏ రోజూ వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయను... ఖరీదైన పోషకాహారాన్ని తీసుకుంటాను. హాయిగా నిద్రపోతాను... కాబట్టి నాకు క్యాన్సర్‌ రాదు’ ఇలా అనుకొంటే అది ఒక అపోహే అంటోంది జీరోధా సంస్థ కో ఫౌండర్‌ సీమాపాటిల్‌. గత నవంబరులో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డ సీమా చికిత్స తీసుకుంటూనే తోటి మహిళల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘కొన్ని నెలలుగా నా రొమ్ముల్లో ఏదో మార్పు గమనించాను. పాపకి పాలు ఇస్తున్నా కాబట్టి ఇలా అవుతుందేమో అనుకున్నా. అయినా నాకు వ్యాయామం అంటే చాలా ఇష్టం. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో అన్నీ చేసేదాన్ని. హాయిగా నిద్రపోతాను. ఒత్తిడి కూడా తక్కువే. కాబట్టి నాకు క్యాన్సర్‌ వచ్చే అవకాశమే లేదు అనుకున్నా. నాలా చాలామంది ఇలానే అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది అపోహే. అలాగని మిమ్మల్ని అధైర్యపరచడం లేదు. ఇవన్నీ చేసినా కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి అని చెబుతున్నా. అలా చేయించుకోవడం వల్లనే తొలిదశలోనే నాలో రొమ్ముక్యాన్సర్‌ని గుర్తించగలిగా. వీటితోపాటు కుటుంబ సభ్యుల మద్దతు, బీమా రక్షణా,  ఉంటే ఈ వ్యాధిని జయించవచ్చు’ అంటూ చెబుతోంజంది సీమాపాటిల్‌. కీమోథెరపీ కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోవడంతో గుండు చేయించుకుంది సీమా. ఆమెకు మద్దతుగా భర్త నితిన్‌ కామత్‌ (జీరోధా సీఈవో) కూడా గుండు చేయించుకుని తన భార్య క్యాన్సర్‌పై ధైర్యంగా చేస్తున్న పోరాటాన్ని లింక్డిన్‌ వేదికగా పంచుకున్నారు. ఇప్పుడాయన పోస్టుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్